సూపర్ స్టార్ మహేష్ బాబుకు( Superstar Mahesh Babu ) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా మహేష్ సైతం సినిమా సినిమాకు ఆ క్రేజ్ ను ఊహించని స్థాయిలో పెంచుకుంటున్న సంగతి తెలిసిందే.మహేష్ బాబు భవిష్యత్తు సినిమాలపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
మహేష్ తాజాగా చేసిన యాడ్ వీడియో ( Ad video )ఒకటి సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
ఆ వీడియోలో మహేష్ సితార కనిపించగా మహేష్ సితార తండ్రీ కూతుళ్లలా కాకుండా అన్నాచెల్లెళ్లలా ఉన్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మహేష్ వయస్సు పెరుగుతోందా? తగ్గుతోందా? అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

రెమ్యునరేషన్ ( Remuneration )పరంగా కూడా మహేష్ బాబు టాప్ లో ఉన్నారు.ప్రభాస్, బన్నీ తర్వాత 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరో మహేష్ బాబు మాత్రమే కావడం గమనార్హం.మహేష్ ప్రస్తుతం జక్కన్న సినిమాతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా కోసం మహేష్ బాబు జుట్టు పెంచిన సంగతి తెలిసిందే.మహేష్ బాబు ఏ లుక్ లో కనిపించినా తన లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు.

మహేష్ బాబు రాజమౌళి కాంబో మూవీలో ప్రియాంక చోప్రా ( Priyanka Chopra )హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.మహేష్ బాబు రెమ్యునరేషన్ రాబోయే రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్ ఉంది.మహేష్ బాబు రాబోయే రోజుల్లో కొత్త ప్రాజెక్ట్ లతో మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాలి.
మహేష్ బాబు తన లుక్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.తర్వాత సినిమాలతో మహేష్ కు హాలీవుడ్ లెవెల్ లో గుర్తింపు వచ్చే ఛాన్స్ అయితే ఉంది.