టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయవంతంగా కెరీర్ ను కొనసాగించాలంటే వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు సాధించడం మినహా మరో ఆప్షన్ లేదు.ఒకానొక దశలో నితిన్( Nitin ) వరుసగా 12 సినిమాలు ఫ్లాప్ కావడంతో కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అలాంటి సమయంలో నితిన్ నటించి విడుదలైన ఇష్క్ సినిమా మంచి లాభాలను సొంతం చేసుకోవడం గమనార్హం.ఇష్క్ సినిమాకు విక్రమ్ కె కుమార్ ( Vikram K Kumar )దర్శకుడు అనే సంగతి తెలిసిందే.
అయితే చాలా సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది.ఈసారి విక్రమ్ కె కుమార్ నితిన్ తో స్పోర్ట్ డ్రామాను తెరకెక్కించనున్నారని సమాచారం అందుతోంది.
ఈ సినిమా తెలుగులో గర్వపడే సినిమాల్లో ఒకటి అవుతుందని నితిన్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతుండటం గమనార్హం.ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ బ్యానర్లలో ఒకటైన యూవీ క్రియేషన్స్ బ్యానర్ ( UV Creations Banner )లో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.నితిన్ విక్రమ్ కె కుమార్ కాంబో మూవీ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.నితిన్ భవిష్యత్తు సినిమాలన్నీ బయటి బ్యానర్లలోనే తెరకెక్కుతుండటం గమనార్హం.ఈ ప్రాజెక్ట్స్ విషయంలో నితిన్ పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

విక్రమ్ కె కుమార్ రెమ్యునరేషన్ సైతం పరిమితంగా ఉందనే సంగతి తెలిసిందే.ఈ దర్శకుడు భవిష్యత్తు సినిమాలతో ఏ స్థాయిలో మ్యాజిక్ చేస్తారేమో చూడాల్సి ఉంది.నితిన్ రాబిన్ హుడ్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారేమో చూడాలి.నితిన్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
హీరో నితిన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.