అవును, ఇపుడు ఇదే వార్తపైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.డబ్బింగ్ సినిమాలను( Dubbing Movies ) ఆదరించడంలో మనవాళ్లు ఎప్పుడూ ముందుంటారు.
ఓ సామెత వుంది మన తెలుగులో… ‘పొరుగింటి పుల్లకూర రుచి’ అన్నట్టు మనవాళ్లు మొదటినుండీ పరాయి భాష సినిమాలను నెత్తిన పెట్టుకొని వస్తూ వున్నారు.అయితే అది తప్పేమీ కాదు కానీ, మన సినిమాళ్లను వారు ఎలా చూస్తారన్నదే సమస్య.
దర్శక ధీరుడు రాజమౌళి( Rajamouli ) పుణ్యమాని తెలుగు సినిమా పరిస్థితి ప్రస్తుతం బాగానే వుంది కానీ, బహుబలికి ముందు వరకు ఓ తెలుగు సినిమాని అస్సలు సినిమాగానే చూసేవారే కాదు.
ఇంతకీ ఈ చర్చ ఎందుకంటే, అందుకే.
ఒక్కోసారి మనవాళ్లు ఇక్కడ అదే కధతో వచ్చిన మూవీని ఫ్లాప్ చేసి, డబ్బింగ్ మూవీని నెత్తిన పెట్టుకున్న దాఖలాలు వున్నాయి… అందుకని ఈ చర్చ.ప్రస్తుతం దాని గురించే సినిమా అభిమానులు గ్రూపులుగా మారి సోషల్ మీడియాలో గుసగుసలాడుకుంటున్నారు.
కేజిఎఫ్( KGF ) సంగతి పక్కన పెడితే, కాంతార( Kantara ) తరువాత కన్నడలో తెరకెక్కిన చిన్న సినిమాల పై కూడా తెలుగు ఆడియెన్స్ దృష్టి పడుతోంది.సినిమా ఏ మాత్రం కొత్తగా ఉన్నా, కాన్సెప్ట్ ఉన్నా వాటికి మనవాళ్లు బ్రహ్మరధం పడుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ‘సప్త సాగరాలు దాటి’( Sapta Sagaralu Dhaati ) అనే టైటిల్ తో తెలుగులో ఓ సినిమా విడుదల అయ్యింది.

ఈ కన్నడ సినిమాకి విపరీతంగా పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు.మరోవైపు జనాలు కూడా ఈ మూవీని బాగా చూస్తున్నట్టు టాక్.అయితే గతంలో ఇలాంటి స్టోరీ లైన్ తో వచ్చిన ప్రముఖ హీరో సినిమా ఫ్లాప్ అయ్యింది.
ఇపుడు దానిగురించే చర్చ నడుస్తోంది.కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి( Rakshit Shetty ) ‘ఛార్లీ’ సినిమాతో తెలుగు ఆడియెన్స్ చేరువయ్యాడు.
అంతకుముందు అతడే శ్రీమన్నారాయణ మూవీ కూడా ఇక్కడ బాగానే ఆడింది.ఈ హీరో నటించిన ఈ సినిమాను ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్ తో సెప్టెంబర్ 22న తెలుగులో రిలీజ్ చేయగా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి.అయితే దాదాపు ఇదే స్టోరీ లైన్ తో రిలీజ్ అయిన మాస్ మహారాజ రవితేజ( Raviteja ) మూవీ మాత్రం ఫ్లాప్ అయ్యింది.ఆ సినిమా పేరే షాక్.( Shock Movie ) హరీష్ శంకర్ మొదటిసారి దర్శకత్వం వహించిన షాక్ మూవీలో రవితేజ, జ్యోతిక జంటగా నటించగా ఈ సినిమాని రామ్ గోపాల్ వర్మ నిర్మించారు.
ఈ మూవీ 2006 లో రిలీజ్ అయ్యి, ప్లాప్ గా మిగిలింది.అదే కాన్సెప్ట్ తో వచ్చిన తెలుగు సినిమాని ఫ్లాప్ చేసి, డబ్బింగ్ సినిమాని మాత్రం సూపర్ హిట్ చేసారు అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మరి మీ అభిప్రాయం చెప్పండి.