జుట్టు రాలడం, చుండ్రు, తలలో తీవ్రమైన దురద.ప్రస్తుత వర్షాకాలంలో ప్రధానంగా వేధించే సమస్యలు ఇవి.
వీటి నుంచి ఉపశమనం పొందడం కోసం ఖరీదైన షాంపూలు, నూనెలు వాడుతుంటారు.తోచిన చిట్కాలన్నీ ప్రయత్నిస్తుంటారు.
అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుంటే ఏం చేయాలో తెలీక మధన పడిపోతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్ హెయిర్ ప్యాక్ ను ట్రై చేశారంటే ఆయా జుట్టు సమస్యలన్నిటినీ సులభంగా దూరం చేసుకోవచ్చు.
మరి ఇంతకీ ఆ హెయిర్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల పొట్టు పెసలు, వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని వాటర్ తో ఒకసారి వాష్ చేసుకోవాలి.
ఆ తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న పెసలు, మెంతులు వేసుకోవాలి.
అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, గుప్పెడు వేపాకులు, అర కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న హెయిర్ ప్యాక్ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారంలో రెండు సార్లు ఈ హెయిర్ ప్యాక్ వేసుకుంటే జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.
చుండ్రు క్రమంగా మాయం అవుతుంది.తల దురద నుంచి సైతం విముక్తి లభిస్తుంది.
కాబట్టి, తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్‌ను ట్రై చేయండి.మంచి ఫలితాలు మీ సొంతమవుతాయి.