నా మనవరాలిని చూసిన ఆనందం సంపాదనలో కనిపించలేదు.. సునీల్ శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి( Athiya Shetty ) ఇటీవలే ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.ఈమె ఇండియా స్టార్ క్రికెటర్ అయినా కేఎల్ రాహుల్( KL Rahul ) ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

 Bollywood Actor Suniel Shetty Note About Granddaughter Details, Bollywood, Sunie-TeluguStop.com

కాగా అతియా శెట్టి బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి( Suniel Shetty ) కుమార్తె అన్న విషయం మనందరికీ తెలిసిందే.కాగా ఈమె బాలీవుడ్ కేవలం కొన్ని సినిమాలలో మాత్రమే నటించింది.

ఆ తర్వాత స్టార్ క్రికెటర్ అయినా కేఎల్ రాహుల్ తో ప్రేమలో పడి దాదాపు మూడేళ్ల పాటు డేటింగ్ లో ఉన్నారు.ఆపై ఇరువురి పెద్దల అంగీకారంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.

కాగా వీరి వివాహా వేడుక ముంబైలోని సునీల్ శెట్టి ఫామ్‌ హౌస్‌లో గ్రాండ్‌ గా జరిగిన విషయం తెలిసిందే.

Telugu Suniel Shetty, Athiya Shetty, Bollywood, Kl Rahul, Klrahul, Sunielshetty-

అయితే అతియాశెట్టి కూతురు పుట్టడంతో తాతయ్య సునీల్ శెట్టి ఆనందం వ్యక్తం చేశారు.తన మనవరాలు పుట్టిన తర్వాత తన జీవితం మారిపోయిందని అన్నారు.తనను చూసి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని కూడా తెలిపారు.

తన జీవితమంతా సినిమా చేస్తూ, వ్యాపారాలు చేసుకుంటూ గడిపానని ఈరోజు తన మనవరాలిని పట్టుకున్నంత ఆనందం ఎప్పుడూ కనిపించలేదని సునీల్ శెట్టి ఎమోషనల్ నోట్‌ లో రాసుకొచ్చారు.సునీల్ తన పోస్ట్‌లో రాస్తూ.

ఇటీవల తాతగా మారడం నాకు వర్ణించలేని అనుభూతి.ఇది ప్రపంచం ఇచ్చే స్వచ్ఛమైన ఆనందం.

నేను దశాబ్దాలుగా వ్యాపారాలు నడుపుతున్నాను.

Telugu Suniel Shetty, Athiya Shetty, Bollywood, Kl Rahul, Klrahul, Sunielshetty-

అలాగే సినిమాలు కూడా చేస్తున్నాను.నా జీవితంలో అర్ధవంతమైన పనిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాను.ఈ విషయంలో నేను గర్వపడుతున్నాను.

కానీ నేను నా మనవరాలిని పట్టుకున్నప్పుడు ఇవేమీ గుర్తుకు రాలేదు.ఇప్పుడు నా మనస్సు మంగుళూరులోని నా చిన్ననాటి రోజులను గుర్తుకు తెచ్చింది.

చెప్పులు లేకుండా పరిగెత్తడం, మైదానంలో ఆడుకోవడం, ప్రేమ తప్ప మరేమీ లేకుండా చేసిన తాజా భోజనం తినడం నిజమైన ఆనందాన్ని ఇచ్చింది అని రాసుకొచ్చారు.నా కుమార్తె అతియా శెట్టి తల్లి కావడం చూస్తుంటే తన మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది.

ఒక తండ్రిగా గర్వంగా కూడా ఉంది అని పోస్ట్ చేశారు.కాగా అతియా శెట్టికి మార్చి 24న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

ఈ సందర్బంగా సునీల్ శెట్టి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube