టెక్నాలజీ అభివృద్ధి మన జీవితాలను సులభతరం చేస్తోంది.అయితే ఇదే టెక్నాలజీని కొందరు కేటుగాళ్లు మోసాల కోసం వినియోగిస్తున్నారు.
ప్రత్యేకంగా యూపీఐ ( UPI ) సేవలు అందుబాటులోకి వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు( Cyber Crimes ) బాగా పెరిగిపోయాయి.స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ ఉంటే చాలు.
ఎవరినైనా మోసం చేయగల చక్కటి వ్యూహాలతో స్కామర్లు( Scammers ) బురిడీ కొట్టిస్తున్నారు.ప్రజల నుంచి డబ్బులు దోచేందుకు ఈ మోసగాళ్లు కొత్తకొత్త ప్లాన్లు అమలు చేస్తున్నారు.
ఎవరో పోలీసులమని, బ్యాంకు అధికారులమని, లేదా ఇంకేవో కబుర్లు చెప్పి వ్యక్తిగత సమాచారం తీసుకొని అకౌంట్లు ఖాళీ చేస్తున్న ఘటనలు రోజూ మనం చూస్తూనే ఉన్నాం.తాజాగా ఒక కొత్త మోసం వెలుగులోకి వచ్చింది.
ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.ఈ వీడియోలో ఒక యువతిని మోసం చేయడానికి ఓ స్కామర్ ప్రయత్నించిన పద్ధతి, కానీ ఆ యువతి చూపిన తెలివితేటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.ఓ స్కామర్ ఆ యువతికి కాల్ చేసి.నేను మీ నాన్న స్నేహితుడ్ని. నీ నాన్నకు నేను డబ్బులు ఇవ్వాలి.ఆయన బిజీగా ఉన్నారు కాబట్టి, ఈ డబ్బులు మా కూతురికి ఇవ్వమని నన్ను అడిగారు అని చెప్పాడు.
ఆ అమ్మాయి వెంటనే స్పందించి.అవునా, నా నాన్న నాకు చెప్పలేదు కదా? అని అంది.దానికి స్కామర్.మీ నాన్న బిజీగా ఉన్నారు కాబట్టి నన్ను నిన్ను సంప్రదించమన్నాడని, వెంటనే ఒక ఫేక్ టెక్స్ట్ మెసేజ్ పంపి నీ నంబర్‌కు 20 వేలు ట్రాన్స్‌ఫర్ చేశా అని చెప్పాడు.
డబ్బులు వచ్చాయా అని అడగగా, అమ్మాయి “అవును వచ్చాయి” అని సమాధానమిచ్చింది.
దీనితో స్కామర్.నిజానికి మీ నాన్నకు 2,000 ఇవ్వాలి.పొరపాటుగా 20,000 పంపాను.
మిగిలిన 18,000 తిరిగి పంపించు అని అడిగాడు.అయితే, బ్యాంక్ నుండి వస్తే రాకూడని ఒక నార్మల్ టెక్స్ట్ మెసేజ్ రావడంతో, అమ్మాయికి ఇది స్కామ్ అని వెంటనే అర్థమైంది.
ఆ యువతి తన తెలివితేటలతో స్కామర్‌ను పట్టేసింది.స్కామర్ పంపిన టెక్స్ట్ మెసేజ్‌ను ఆమె ఫేక్‌గా ఎడిట్ చేసి ని మిగితా 18,000 ట్రాన్స్‌ఫర్ చేశాను అని టెక్స్ట్ మెసేజ్ పంపింది.
ఆ తర్వాత స్కామర్‌కు మెసేజ్ చేసి.అయ్యో అంకుల్ డబ్బులు వచ్చాయా? అని అడిగింది.ఇలా తనే చేసిన స్కామ్‌ను స్కామర్ పైనే తిప్పి వేసింది ఆ యువతి.స్కామర్ దొరికిపోయానని గ్రహించి షాక్‌కు గురయ్యాడు.చివరికి ఈ యువతి తెలివికి మెచ్చుకొని కాల్ కట్ చేసి మౌనంగా మిగిలిపోయాడు.ఈ మొత్తం ఘటనను ఆ యువతి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ప్రజలు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె అందరికీ సూచించింది.వీడియో చూసిన నెటిజన్లు ఆమె ధైర్యానికి, తెలివికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.