సాదారణంగా ప్రతి ఇంటిలో బొద్దింకలు ఉంటాయి.వాటిని ఎలా వదిలించుకోవాలో అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉంటారు.
ఈ చిన్న జీవులు ఆరోగ్యానికి హాని చేస్తాయి.ఇవి వ్యాధులను కలిగించే వివిధ రకాల క్రిములు మరియు బాక్టీరియా వాహకాలుగా పనిచేస్తాయి.
ఇవి పరిసరాల చుట్టూ కలుషితం చేయటమే కాకుండా అలెర్జీలకు కారణం అవుతాయి.మనం కొంచెం సమయాన్ని కేటాయిస్తే బొద్దింకలను వదిలించుకోవచ్చు.ఇప్పుడు బొద్దింకలను వదిలించుకోవటానికి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.
1.బోరాక్స్ మరియు పంచదార
బోరాక్స్ బొద్దింక పెరుగుదల నియంత్రించడానికి మరియు ఇంటిలోకి
ప్రవేశించకుండా నివారించటానికి సహాయపడుతుంది.బోరాక్స్ కీటకాల జీర్ణ
వ్యవస్థను నష్టపరచి చనిపోయేలా చేస్తుంది.
బొద్దింకను ఆకర్షించటానికి
బోరాక్స్ తో పంచదారను కలపాలి.
* బోరాక్స్ మూడు భాగాలు మరియు చక్కెర ఒక భాగం కలపాలి.
* ఈ మిశ్రమాన్ని రాత్రి సమయంలో బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో పెట్టాలి.
* మరుసటి రోజు అనేక బొద్దింకలు చనిపోవటం చూడవచ్చు.
* ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే బొద్దింకలు తగ్గిపోతాయి.
2.వేప
వేప నూనె లేదా పొడి కీటకాల నియంత్రణకు బాగా సహాయపడుతుంది.వేపకు
తెగుళ్లను దూరంగా ఉంచే సామర్ధ్యం చాలా ఎక్కువగా ఉంది.
అలాగే దీనిలో తక్కువ విషం ఉండుట మరియు తక్కువ ఖరీదులో ఉంటుంది.
* ఒక సాధారణ పరిమాణం స్ప్రే సీసా లో నీటిని తీసుకోని దానిలో ఒక స్పూన్ వేప నూనె కలిపి రాత్రి సమయంలో ప్రభావిత ప్రాంతాల్లో స్ప్రే చేయాలి.
ఈ
విధంగా ప్రతి రోజు చేయాలి.
* అలాగే ప్రభావిత ప్రాంతాల్లో వేప పొడిని చల్లవచ్చు.
3.కాఫీ
కాఫీ వాసన ఇంటిలో చీకటి మరియు నిశ్శబ్ద మూలల నుండి బొద్దింకలను బయటకు
రప్పిస్తుంది.బొద్దింకలను వదిలించుకోవటానికి ఇది ఒక సమర్ధవంతమైన ఎంపిక
అని చెప్పవచ్చు.
* కొన్ని గాజు పాత్రలలో నీటిని నింపాలి.
* గాజు పాత్రల లోపల చిన్న కాగితపు కప్పులలో కాఫీని ఉంచాలి.
* వీటిని గోడలకు వ్యతిరేకంగా పెడితే బొద్దింకలు వాసనకు బయటకు వచ్చి గాజు
పాత్రలోకి వెళ్ళతాయి.
అవి తప్పించుకోవటానికి అవకాశం ఉండదు.