కాల భైరవుడే నాతో రాయించాడని నమ్ముతున్నాను.. సంపత్ నంది కామెంట్స్ వైరల్!

డైరెక్టర్ సంపత్ నంది( Director Sampath Nandi ) పర్యవేక్షణలో అశోక్ తేజ దర్శకత్వం వహించిన సినిమా ఓదెల 2.( Odela 2 ) ఇందులో తమన్నా( Tamanna ) ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

 Director Sampath Nandi Exclusive Interview Details, Director Sampathi Nandi, Tol-TeluguStop.com

పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రూపొందిన విషయం తెలిసిందే.ఇందులో హెబ్బా పటేల్, వశిష్ట, ఎస్ సింహ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమా ఈనెల 17న థియేటర్లలోకి రాబోతున్న విషయం తెలిసిందే.విడుదల తేదీకి మరో రెండు రోజులు మాత్రమే సమయము ఉండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేశారు.

అందులో భాగంగానే తాజాగా విలేకరులతో ముచ్చటించారు మూవీ మేకర్స్.

Telugu Sampathi Nandi, Odela, Sampath Nandi, Sampathnandi, Shiva Shakthi, Tamann

ఈ సందర్భంగా డైరెక్టర్ సంపత్ నంది కొన్ని విషయాలను పంచుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఒక ప్రేతాత్మకు పంచాక్షరి మంత్రానికి మధ్య జరిగే యుద్ధమే ఓదెల 2 అని తెలిపారు.

ఓదెల మూవీలో ఒక దుష్టశక్తి అంతమయ్యాక అది ఆత్మగా మారుతుందట.దీంతో దాన్ని అడ్డుకోవడానికి మరో గొప్ప శక్తి రావాల్సిన అవసరం ఏర్పడుతుంది.

అలాంటప్పుడు శివశక్తి ( Shiva Shakti ) లాంటి పాత్ర కథలోకి వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచి పూర్తి స్క్రిప్ట్‌ ను సిద్ధం చేశాము.నిజానికి మా నాన్నమ్మ కూడా శివశక్తిగానే జీవించారు.

ఆమె 98ఏళ్లు బతికారు.

Telugu Sampathi Nandi, Odela, Sampath Nandi, Sampathnandi, Shiva Shakthi, Tamann

చిన్నప్పుడు మా ఊరి చుట్టు పక్కల అలాంటి వాళ్లను చాలా మందిని చూశాను.ఈ శివశక్తులే నాగ సాధువులుగా మారతారని, వాళ్లే శివాలయాల్ని పునరుద్ధరణ చేస్తారని నా పరిశోధనలో తెలుసుకున్నాను.అలా ఈ అంశాలతోనే తమన్నా పాత్రను తీర్చిదిద్దుకున్నాను.

ఆమె కూడా ఈ కథ వినగానే బాగా నచ్చి చేస్తానని చెప్పారు అని తెలిపారు సంపత్ నంది.అలాగే ట్రైలర్‌ చూసి చాలా మంది దీన్ని అరుంధతి సినిమాతో పోలుస్తున్నారు.

కానీ ఆ చిత్రానికి మా సినిమాకి ఏ పోలిక లేదు.రెండూ వేటికవే ప్రత్యేకమైన చిత్రాలు.

ఈ చిత్రంలో విజువల్స్‌ అన్నీ చాలా కొత్తగా ఉంటాయి.దాదాపు 150 మంది వీఎఫ్‌ఎక్స్‌ నిపుణులు ఆరు నెలల పాటు దీనికోసం కష్టపడ్డారు.

క్లైమాక్స్‌ ఫైట్‌ ను రామోజీ ఫిల్మ్‌ సిటీలో భారీ సెట్‌ వేసి చిత్రీకరించాము.అదీ చిత్రానికి ఆకర్షణగా నిలుస్తుంది.

దీనికి కొనసాగింపుగా ఓదెల 3 కూడా ఉంటుందని చెప్పాం.కాకపోతే ఇలాంటి చిత్రాలకు మనం ఏదీ ప్లాన్‌ చేయలేం.

అవన్నీ దేవుడు ప్లాన్‌ చేయాలనే భావిస్తాను.ఓదెల 2 సినిమాని కాలభైరవుడే రాయించాడని నమ్ముతున్నాను అని సంపత్ నంది చెప్పుకొచ్చారు.

ఈ సందర్బంగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube