మచ్చలు చర్మ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.అందుకే దాదాపు ప్రతి ఒక్కరూ మచ్చలేని చర్మాన్ని కోరుకుంటారు.
కానీ ఏదో ఒక కారణం చేత ముఖ చర్మంపై మచ్చలు పడుతూనే ఉంటాయి.కొందరు ఆ మచ్చలను వదిలించుకోవడం కోసం నిత్యం శ్రమిస్తుంటారు.
కానీ కొందరికి చర్మంపై ఏర్పడిన మచ్చలను వదిలించుకునేంత సమయం ఉండకపోవచ్చు.అలాంటివారికి ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.
వారంలో కేవలం రెండు సార్లు మాత్రమే ఈ రెమెడీని పాటిస్తే ముఖంపై చిన్న మచ్చ కూడా ఉండదు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక బౌల్ ను తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ బీట్ రూట్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ రోజ్ పెటల్స్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ చందనం పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్ వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, సరిపడా రోజ్ వాటర్ ను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సహాయంతో ముఖ చర్మానికి కాస్త మందంగా అప్లై చేసుకోవాలి.

ముప్పై నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకుని.ఆపై వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.వారానికి కేవలం రెండు సార్లు ఈ హోమ్ మేడ్ రెమెడీని కనుక పాటిస్తే ముఖంపై ఎలాంటి మచ్చలైన క్రమంగా మాయమవుతాయి.
పిగ్మెంటేషన్ సమస్య నుంచి విముక్తి పొందడానికి కూడా ఈ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

అలాగే ఈ రెమెడీని పాటిస్తే కొద్ది రోజుల్లోనే క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.పైగా స్కిన్ టోన్ మెరుగుపడుతుంది.ముడతలు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.
మరియు ముఖం యవ్వనంగా కాంతివంతంగా సైతం మెరుస్తుంది.కాబట్టి తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.
క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను మీ సొంతం చేసుకోండి.