ప్రస్తుత కాలంలో దాదాపు అందరూ కూడా ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగుతూ ఉంటారు.ఈ పానీయాలను ఎక్కువగా తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా ప్రమాదం.
వీటికి బదులు గా మన ఆరోగ్యానికి మేలు చేసే దాల్చిన చెక్క తో తయారు చేసే కాఫీ ని తాగితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.ప్రతి రోజూ ఉదయం దాల్చిన చెక్కతో చేసిన కాఫీ తాగాలి.
అందులోని యాంటీ ఆక్సిడెంట్ శరీరం లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది.
రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించి మధుమోహాన్ని కంట్రోల్ లో ఉంచుతుంది.
వాపు,గాయాల ను కూడా నయం చేస్తుంది.
నాలుగు యాలక్కాయలు వేసి కాచిన కాఫీ రుచి, సువాసన తో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.ఇందు లోని ఫైబర్, మినరల్స్ శరీరంలో రక్త ప్రసరణను వేగవంతం చేస్తాయి.
అజీర్తి, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది.ముక్కు దిబ్బడ, వికారం, వాంతులు తగ్గడానికి ఇది పనిచేస్తుంది.
యాలక్కాయలే కాకుండా కాఫీలో లవంగాన్ని కూడా వేసుకోనీ తయారు చేసుకోవచ్చు.

విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్, పొటాషియం, మాంగనీస్, మినరల్స్ లాంటివి జాజికాయలో కూడా చాలా ఉన్నాయి.దీన్ని కాఫీతో పాటు కలిపి తాగితే జీర్ణ సమస్యలు తగ్గి జీర్ణక్రియ బాగా జరుగుతుంది.ఇటువంటి కాఫీ తాగితే ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
నిద్రలేమిని సమస్యను తగ్గిస్తుంది.ముక్కు దిబ్బడను దూరం చేస్తుంది.
అల్లం కూడా కాఫీ లో వేసుకొని తాగితే మన ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి.కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న దాల్చిన చెక్క తో తయారు చేసిన కాఫీని తాగడం మన ఆరోగ్యానికి చాలా మంచిది.