హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేసి జుట్టును ఒత్తుగా మార్చే సూపర్ రెమెడీ ఇదే!

హెయిర్ ఫాల్( Hair fall ) తో తీవ్రంగా సతమతం అవుతున్నారా? కురులు రోజురోజుకు పల్చగా మారుతున్నాయా? జుట్టు రాలడాన్ని ఎలా అరికట్టాలో అర్థం కావడం లేదా? అయితే అస్సలు చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సూపర్ ప‌వ‌ర్ ఫుల్ హోమ్ రెమెడీ హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేసి జుట్టును ఒత్తుగా మార్చేందుకు చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

 This Is A Super Remedy To Control Hair Fall And Make Hair Thicker! Hair Fall, St-TeluguStop.com

ఎంతటి తీవ్రమైన హెయిర్ ఫాల్ కు అయినా ఈ రెమెడీతో సులభంగా చెక్ పెట్టవచ్చు.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక అరటి పండు తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక అలోవెరా ఆకు( Aloe vera )ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను వేరు చేసుకోవాలి.ఆ త‌ర్వాత‌ మిక్సీ జార్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఉడికించిన రైస్, క‌ట్ చేసి పెట్టుకున్న‌ అరటి పండు ముక్కలు వేసుకోవాలి.

అలాగే రెండు రెబ్బలు కరివేపాకు, రెండు రెబ్బలు వేపాకు, ప‌ది ఫ్రెష్ తులసి ఆకులు, ఒక మందారం పువ్వు( Holy Basil ), ఒక కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్ వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి కేవ‌లం ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే జుట్టు రాల‌డం క్రమంగా అదుపులోకి వస్తుంది.హెయిర్ గ్రోత్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.జుట్టు కొద్ది రోజుల్లోనే ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.చుండ్రు సమస్య ఉన్న సరే దూరం అవుతుంది.కాబట్టి ఎవరైతే హెయిర్ ఫాల్ సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్నారో వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.జుట్టు రాలడాన్ని అరికట్టండి.

ఒత్తైన జుట్టును మీ సొంతం చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube