రాఘవేంద్రరావు సినిమాని రిజెక్ట్ చేసిన నాగార్జున.. ఏ సినిమానో తెలిస్తే..?

అక్కినేని నాగార్జున, రాఘవేంద్రరావు( K Raghavendra Rao ) కలిసి ఆఖరి పోరాటం, జానకి రాముడు, ఘరానా బుల్లోడు సినిమాలతో భారీ హిట్స్ తమ ఖాతాలో వేసుకున్నారు.భక్తిరసాత్మక చిత్రం ‘అన్నమయ్య’తో కూడా ఓ సంచలన విజయం సాధించారు.

 Why Nagarjuna Rejected Raghavendra Rao ,k Raghavendra Rao , Nagarjuna , Tollyw-TeluguStop.com

అన్నమయ్యగా నాగార్జున అద్భుతంగా నటించాడు.రాఘవేంద్రరావు ఈ సినిమాని గొప్పగా తీసి విమర్శకుల చేత కూడా పొగిడించుకున్నాడు.దీనికి నేషనల్, నంది, ఫిలింఫేర్‌ అవార్డ్స్ కూడా వచ్చాయి.9 ఏళ్ల తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి ‘శ్రీరామదాసు (2006)’ సినిమా చేశారు.ఇది ప్రేక్షకుల్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తింది.

Telugu Raghavendra Rao, Nagarjuna, Shirdi Sai Baba, Tollywood-Movie

ఆరేళ్ల తర్వాత ‘ఇంటింటా అన్నమయ్య( Intinta Annamayya )’ పేరుతో ఓ సోషియో ఫాంటసీ సినిమా తీయాలని రాఘవేంద్రరావు భావించాడు.నాగార్జునను హీరోగా అనుకున్నాడు.కానీ నాగార్జున ఆ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు.

ఈ విషయాన్ని నేరుగా చెప్పకపోయినా ఆయన సైలెంట్‌గా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.మనీ కోసం ‘అన్నమయ్య’ పేరుతో అలాంటి మరో సినిమా తీసి ప్రేక్షకులపై రుద్దడం మంచిది కాదని నాగార్జున( Nagarjuna ) అనుకున్నాడు.

ఆ పేరుతోనే మరో సినిమా చేస్తే ప్రేక్షకుల అంచనాలు వేరే రేంజ్‌లో ఉంటాయని, వాటిని అందుకోవడం కూడా కష్టమే అని నాగార్జున ఫీలయ్యాడు.

Telugu Raghavendra Rao, Nagarjuna, Shirdi Sai Baba, Tollywood-Movie

ప్రేక్షకుల అంచనాలు అందుకోకపోతే ఇంతకుముందు తెచ్చుకున్న పేరంతా కూడా పోతుందని, ప్రేక్షకుల్లో నవ్వులు పాలు అవుతామని నాగార్జున భయపడ్డాడు.రాఘవేంద్రరావుకు నేరుగా సమాధానం చెప్పకుండా సాయిబాబా కథతో సినిమా చేస్తే బాగుంటుందని నాగార్జున టాపిక్ డైవర్ట్ చేశాడు.తర్వాత ఇద్దరి మధ్య ఆ సినిమా టాపిక్ రాలేదు.

మరోవైపు ఓ ఆదివారం ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకుంటుండగా నాగార్జునకు ఎందుకో షిరిడీ వెళ్లాలనే కోరిక పుట్టింది.అంతే వెంటనే నాగ్ తన ఫ్రెండ్ మహేష్‌రెడ్డిని వెంట బెట్టుకుని షిరిడీ వెళ్లి సాయిబాబా( Shirdi Sai Baba )ను దర్శించుకున్నాడు.

తర్వాత హైదరాబాద్‌ తిరిగి వచ్చేసాడు.ఈ సంగతి రాఘవేంద్రరావుకి తెలియదు కానీ అదేరోజు నాగార్జునను కలిసి మనం షిరిడీ సాయి కథతో సినిమా చేయబోతున్నామని చెప్పాడు.“మీరు భక్తుడిగా కాకుండా బాబా లాగా నటించాలి.” అని నాగార్జునతో చెప్పాడు.బాబా దగ్గరికి వెళ్లి ఇంటికి రాగానే బాబా లాగా నటించే ఛాన్స్ రావడం నాగార్జునకు ఆశ్చర్యంగా అనిపించింది.ఈ సినిమాకి నాగ్ ఫ్రెండ్ మహేష్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరించాడు.

నాగార్జున అంతకుముందు చేసిన అన్ని భక్తి సినిమాల్లో భక్తుడి గానే కనిపించాడు కానీ ‘శిరిడిసాయి’ మూవీలో మాత్రం సాయిబాబాగా యాక్ట్ చేశాడు.ఈ సినిమా బాగానే ఆడింది.

అయితే వేరే వాళ్లతో రూపొందించిన ఇంటింటా అన్నమయ్య సినిమా మాత్రం షూటింగ్ పూర్తయినా ఇప్పటిదాకా రిలీజ్ కాలేదు.దీని ఫస్ట్ కాపీ పదేళ్ల క్రితం సిద్ధమైంది కానీ ఇప్పటికీ విడుదల కాకపోవడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube