టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Hero Prabhas ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
సినిమా సినిమాకు తనకున్న క్రేజ్ నీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ మరింత పెంచుకుంటూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు ప్రభాస్.ఇకపోతే బాహుబలి( Bahubali ) సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ అదే ఊపుతో మరిన్ని పాన్ ఇండియా మూవీలో( Pan India Movie ) నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా రెండు భాగాల సినిమాల ట్రెండు నడుస్తున్న విషయం తెలిసిందే.అంటే సినిమాలు పార్ట్ 1, పార్ట్ 2 లుగా విడుదల అవుతున్నాయి.
అయితే నిజానికి ఈ పార్ట్ వన్ పార్ట్ టు సినిమాల ట్రెండు ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా తోనే మొదలైందని చెప్పవచ్చు.ఇక ఈ సినిమా తర్వాత అదే విషయాన్ని కంటిన్యూ చేస్తున్నారు డార్లింగ్ ప్రభాస్.
కానీ ఈ రెండు భాగాల సినిమాల విషయంలో ప్రభాస్ తప్పటడుగులు వేస్తున్నాడనే అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తమయ్యాయి.ప్రభాస్ గత సినిమాలు అయినా కల్కి,సలార్ సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని సాధించాయో మనందరికీ తెలిసిందే.
ఈ రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు ప్రభాస్.సలార్ ( Salar )రూ.700 కోట్ల గ్రాస్ రాబట్టగా, కల్కి రూ.1100 కోట్ల గ్రాస్ రాబట్టింది.ఈ రెండు సినిమాలు కూడా రెండు భాగాలుగా రానున్నట్లు విడుదలకు ముందే ప్రకటించారు.
కానీ ఇప్పట్లో ఈ సినిమాల సెకండ్ పార్ట్ లు వచ్చే అవకాశం కనిపించడం లేదు.మొదటి భాగం మంచి విజయం సాధించినప్పుడు, హీరో, డైరెక్టర్ ఇతర సినిమాల జోలికి పోకుండా, తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ గా పార్ట్-2 ని విడుదల చేస్తే ఆడియన్స్ లో ఒక రేంజ్ క్రేజ్ ఉంటుంది.బాహుబలి, కేజీఎఫ్, పుష్ప వంటి సినిమాలను దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
కానీ సలార్, కల్కి.సినిమాల విషయంలో అలా జరగడం లేదు.
సలార్ తర్వాత కల్కి వచ్చింది.కల్కి తర్వాత రాజా సాబ్.
రానుంది.ఆ తర్వాత కూడా సలార్ 2, కల్కి 2.సినిమాలి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Director Prashanth Neel )తన నెక్స్ట్ మూవీని జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్నాడు.
ఆగష్టు 9న ఈ మూవీ లాంచ్ కానుంది.ఇది కూడా రెండు భాగాలుగా తెరకెక్కనుందని అంటున్నారు.అదే జరిగితే ఇప్పట్లో సలార్ 2 పట్టాలెక్కే అవకాశం లేదు.
ఇక కల్కి విషయానికొస్తే.డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఫోకస్ కల్కి 2 పైనే ఉన్నప్పటికీ.ప్రభాస్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది అనుమానం.
ఎందుకంటే ప్రస్తుతం రాజా సాబ్ మూవీతో బిజీగా ఉన్న ప్రభాస్.హను రాఘవపూడి ప్రాజెక్ట్ ఫౌజీ.
ని కూడా పారలల్ గా కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నాడు.దీని తర్వాత స్పిరిట్.
లైన్ లో ఉంది.వీటి నడుమ కల్కి 2 కి ప్రభాస్ ఎప్పుడు సమయం కేటాయిస్తాడనేది ప్రశ్నార్థకంగా మారింది.
అయితే కల్కి 2, సలార్ 2 సినిమాలపై భారీగా హైప్ ఉన్నప్పటికీ ఈ సినిమాలు విడుదల ఇవ్వడానికి చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది.అయితే పార్ట్ 2 పై మంచి మంచి హైప్ ఉన్న సమయంలో దానిని త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలి.
అలా కాకుండా ఇతర ప్రాజెక్ట్ లు చేసి, ఎప్పటికో పార్ట్ 2 ని విడుదల చేస్తే ఆడియన్స్ లో మునుపటి క్రేజ్ ఉండకపోవచ్చని, అందుకే ఈ విషయంలో ప్రభాస్ తెలిసో తెలియకో తప్పు చేస్తున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.మరి ఈ విషయంపై ఆయా మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.