సాధారణంగా కొందరి నోటి నుంచి భరించలేనంత దుర్వాసన వస్తుంటుంది.ఇలాంటి వారు ఇతరులతో మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడుతుంటారు.
నోటి దుర్వాసన సమస్యను( Bad breath problem ) దూరం చేసుకోవడానికి ఖరీదైన టూత్ పేస్ట్‌లు, మౌత్ వాష్‌లు వాడుతుంటారు.కానీ నోటి దుర్వాసనకు కారణాలేంటి? అన్న విషయాన్ని మాత్రం పట్టించుకోవచ్చు.నోటి శుభ్రత, దంత రక్షణ లేకపోవడం వల్లే నోటి నుంచి దుర్వాసన వస్తుందని చాలా మంది భావిస్తారు.నిజానికి అవి మాత్రమే కాదు ఇంకా చాలా కారణాలు కూడా ఉన్నాయి.
పళ్లలో క్రిములు మరియు క్యావిటీస్, ఫలకం పేరుకుపోవడం, పళ్లలో నిలిచిపోయిన ఆహారపు అవశేషాలు, నోటిలోని బాక్టీరియా, నోటి శుభ్రత లేకపోవడం వల్ల బ్యాడ్ బ్రీత్ సమస్య ఏర్పడుతుందని అందరికీ తెలుసు.అలాగే మాంసాహారం( non-vegetarian ) అధికంగా తీసుకోవడం, తక్కువ నీరు తాగడం, ఉల్లి, వెల్లుల్లి వంటి ఘాటైన వాసన కలిగిన ఆహారాలను అధికంగా తీసుకోవడం వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుంది.

ధూమపానం, మద్యం( Smoking, alcohol ) వంటి చెడు అలవాట్లు నోటిలో పొడిబారిన పరిస్థితిని కలిగించి బ్యాడ్ బ్రీత్ కు కారణం అవుతాయి.డయాబెటిస్, కిడ్నీ సమస్యలు, లివర్ వ్యాధులు ఉన్నవారు కూడా నోటి దుర్వాసన సమస్యను ఫేస్ చేస్తారు.జీర్ణ సంబంధ సమస్యలు, జలుబు, టాన్సిల్ స్టోన్స్, సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది.ఈ సమస్యకు చెక్ పెట్టాలనుకుంటే రోజుకు రెండు సార్లు పళ్ళు బ్రష్ చేయాలి.
దంతాలను, నాలుకను శుభ్రం చేసుకోవాలి.ఆల్కహాల్, ధూమపానం తగ్గించాలి లేదా పూర్తిగా మానేయాలి.
ఎక్కువ నీరు తాగాలి.పుదీన లేదా తులసి ఆకులను నోటిలో వేసి నమలడం ద్వారా దుర్వాసన తగ్గుతుంది.
ఇవి నోటి లోపలి భాగాన్ని శుభ్రపరుస్తాయి, బ్యాక్టీరియాను అంతం చేస్తాయి.

గ్రీన్ టీ కూడా బ్యాడ్ బ్రీత్ ను కంట్రోల్ చేస్తుంది.రోజూ మార్నింగ్ ఒక కప్పు గ్రీన్ టీ( Green tea ) తీసుకుంటే.అందులోని యాంటీ ఆక్సిడెంట్లు నోటి తాలూకు సమస్యలను తగ్గిస్తాయి.
గ్రీన్ టీ బదులు సోంపు టీ తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.ఇక నోటి నుంచి వచ్చే దుర్కాసనకు లవంగాలు, యాలకులతో చెక్ పెట్టవచ్చు.
వీటిని సహజ మౌత్ ఫ్రెష్నర్స్ గా వాడొచ్చు.