మగవారి ముఖ సౌందర్యానికి అద్భుతమైన చిట్కాలు

మగువలు ముఖ అందం పట్ల ఎక్కువగా శ్రద్ద చూపుతూ ఉంటారు.కానీ మగవారు మాత్రం పెద్దగా శ్రద్ద పెట్టరు.

 Men Face Care Tips-TeluguStop.com

అయితే కొంతమంది మగవారు అందం పట్ల ఎక్కువగానే శ్రద్ద పెడుతూ ఉంటారు.అయితే ముఖ సౌందర్యం అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు.

ప్రతి రోజు కొన్ని చిట్కాలను పాటించటం ద్వారా ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

మగవారు కూడా క్లెన్స‌ర్‌, స్క్ర‌బ్బ‌ర్‌, మాయిశ్చ‌రైజ‌ర్ వంటి వాటిని వాడవచ్చు.అయితే ఘాడత తక్కువగా ఉన్న వాటిని మాత్రమే ఉపయోగించాలి.షేవింగ్ క్రీమ్,ఆఫ్టర్ షేవింగ్ లోషన్ ఇలా ఏది వాడిన హానికార‌క కెమికల్స్ లేకుండా చూసుకోవాలి.

చాలా మంది మగవాళ్ళు అమ్మాయిలు వాడే అమ్మాయిలు వాడే ర‌క‌ర‌కాల క్రీములు, టోన‌ర్లు, మాయిశ్చ‌రైజ‌ర్లు వాడుతూ ఉంటారు.ఆలా వాడితే అవి చర్మం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి.అందువల్ల మగవారికి సంబందించిన క్రీమ్స్ వాడితేనే మంచిది.

మంచి సంరక్షణ పద్దతులను పాటించే మగవారు ప్రతి రోజు ఉదయం,రాత్రి పడుకొనే ముందు ముఖం కడిగే వారు గ్లైకోలిక్ యాసిడ్ వాడితే మంచిది.అయితే గ్లైకోలిక్ యాసిడ్ వాడటం ఇష్టం లేనివారు గ్లైకోలిక్ యాసిడ్ ఉన్న క్రీమ్స్ ని వాడవచ్చు.

ముఖానికి వాడాల్సిన క్రీమ్స్ మాత్రమే ఉపయోగించాలి.శరీరానికి ఉపయోగించే బాడీ లోషన్స్ వాడితే చర్మ రంద్రాలు మూసుకొని పోయే అవకాశాలు ఉన్నాయి.

అందువల్ల శరీరానికి ఉపయోగించే లోషన్స్ ముఖానికి ఉపయోగించకూడదు.

.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు