సాధారణంగా ప్రతి రోజూ మనం ఉదయం నిద్ర లేవగానే మన ఇష్టదైవాన్ని తలుచుకుని కళ్ళు తెరుస్తాము.ఈ రోజంతా వారికి ఎంతో అనుకూలంగా జరగాలని, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ఇష్టదైవాన్ని నమస్కరించి నిద్ర లేస్తాము.
ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కళ్ళు తెరవగానే వారికి ఎంతో ఇష్టమైన దేవుడు ప్రతిరూపం చూస్తారు.పురాణాల ప్రకారం మన జీవితంలో విజయాలను సొంతం చేసుకోవాలంటే ప్రతి రోజు ఉదయం నిద్ర లేచి సూర్యభగవానుడికి నమస్కరించాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
ఇప్పటికీ మన ఇంట్లో పెద్ద వారు ప్రతిరోజు ఉదయం ఉదయిస్తున్న సూర్యునికి నమస్కరించడం మనం చూస్తుంటాము.ఉదయిస్తున్న సూర్యుడు ఎంతో పెద్దగా ఎర్రగా ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తాడు.
ఈ విధమైనటువంటి దృశ్యాన్ని చూసినప్పుడు మన మనస్సు ఎంతో విశాలతత్వాన్ని కలిగి ఉంటుంది.అందుకోసమే మన ఇంట్లో ఏడు గుర్రాల పై స్వారీ చేస్తున్నటువంటి సూర్యుని ఫోటో ఉండటం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.
ఇటువంటి ఫోటో మన ఇంట్లో ఉంటే తప్పకుండా తూర్పు గోడకు ఉండాలి.ఉదయం నిద్ర లేవగానే వెళ్లి ఏడు గుర్రాలను స్వారీ చేస్తున్నటువంటి సూర్యని ఫోటోకు నమస్కరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

కొందరు కొన్ని అపోహల వల్ల సూర్యుడి ఫోటో ఇంట్లో ఉండకూడదని భావిస్తుంటారు.ఎట్టి పరిస్థితులలో కూడా సూర్యభగవానుడి ఫోటోను ఇంట్లో నుంచి తీసేయ కూడదు.సూర్యభగవానుడి ఫోటో మన ఇంట్లో ఉండటం వల్ల ఆ ఫోటో నుంచి ఎంతో పాజిటివ్ ఎనర్జీ మన ఇల్లంతా వ్యాపిస్తుంది.ఈ క్రమంలోనే మన మనస్సు ఎంతో ఆహ్లాదంగా సంతోషకరంగా ఉండాలంటే ప్రతిరోజు సూర్యభగవానుడి ఫోటో ముందు ఒక రాగి చెంబులో ఎర్రటి పుష్పాలను, ఎర్రచందనం, బియ్యం స్వామివారి ముందు ఉంచి సూర్య మంత్రం పటించడం వల్ల మనకు అన్ని మంచి జరుగుతాయని పురోహితులు చెబుతున్నారు.
ఈ విధంగా ప్రతి రోజు సూర్యుని ఫోటోకి నమస్కరించడం వల్ల మనం చేసే పనిలో విజయం కలగడమే కాకుండా మన కుటుంబంలో ఏర్పడిన నెగిటివిటీ మొత్తం వెళ్ళిపోయి ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుందని పండితులు చెబుతున్నారు.