బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి.. సూర్యాస్తమయం తర్వాత ఆహారం తీసుకొని పక్షి..?

మన భూమిపై ఎన్నో రకాల పక్షుల ( Birds )జాతులు ఉన్నాయి.వాటిలో వేకువ జామునే అంటే బ్రహ్మ ముహూర్తంలోనే మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి( Crow ).

 After Taking Bath In Brahma Muhurtham After Sunset The Bird Takes Food , Birds-TeluguStop.com

అంతేకాకుండా సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితులలోనూ ఆహారం ముట్టని జీవి కాకి మాత్రమే అని చాలా మందికి తెలియదు.అంతే కాకుండా సూర్యగ్రహణానికి ముందు గ్రహణం పూర్తి అయ్యాక స్నానం చేసే ఏకైక పక్షి కాకి.

గ్రహణం తర్వాత తన గూడును శుభ్రం చేసుకునే పక్షి కాకి.కావు కావు అని శబ్దం చేస్తూ ఈ బంధాలు, సిరిసంపదలు ఏవి నీవి కావు, ఏమి శాశ్వతము కావు అని అందరికీ కాకి గుర్తు చేస్తూ ఉంటుంది.

Telugu Birds, Crow, Eclipse, Green Nature, Habit, Pinda Pradanam, Solar Eclipse,

అందుకే కాకిని కాలజ్ఞాని అని కూడా పిలుస్తారు.కాకులు ఎక్కడైనా ఆహారం కనిపిస్తే తోటి కాకులను పిలిచి కలిసిమెలిసి తింటాయి.నాలుగు మెతుకులు అయినా పంచుకొని తినాలని కాకుల్ని చూసి మనిషి నేర్చుకోవచ్చు.అలాగే ఒక కాకి ప్రమాదవశాత్తు మరణిస్తే తోటి కాకులు చుట్టూ చేరి అరుస్తాయి.చనిపోయిన కాకికి తమ అరుపులతో సంతాపం ప్రకటించి స్నానం చేస్తాయి.సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే మంచి అలవాటు సమయపాలన కాకులదే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అంతేకాకుండా సూర్యాస్తమయం తర్వాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులకు ఉంది.పచ్చని ప్రకృతిని విస్తరించి పరిరక్షించడంలో కాకుల పాత్ర ప్రముఖమైనది.

Telugu Birds, Crow, Eclipse, Green Nature, Habit, Pinda Pradanam, Solar Eclipse,

ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ ఉంటాయి.కానీ ప్రస్తుతం భూమి మీద కాకులు అంతరించిపోతున్న దశలో ఉన్నాయి.ఒకప్పుడు ఎక్కడపడితే అక్కడ కాకి కనిపించేది.అటువంటిది ఇప్పుడు పెద్దలకు శ్రద్ధ కర్మలు చేస్తే, పిండ ప్రధానం( Pinda pradanam ) చేస్తే వాటిని ముక్కుతో ముట్టడానికి కూడా కాకులు కనిపించడం లేదు.

కాకి రూపంలో మరణించిన పెద్దలు తిరుగుతుంటారని ఒక నమ్మకం కూడా ప్రజలలో ఉంది.సాక్షాత్తు యమధర్మ రాజే వాటికి ఆ వరం ఇచ్చినట్లుగా కూడా ఒక పురాణ కథ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube