బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి.. సూర్యాస్తమయం తర్వాత ఆహారం తీసుకొని పక్షి..?

మన భూమిపై ఎన్నో రకాల పక్షుల ( Birds )జాతులు ఉన్నాయి.వాటిలో వేకువ జామునే అంటే బ్రహ్మ ముహూర్తంలోనే మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి( Crow ).

అంతేకాకుండా సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితులలోనూ ఆహారం ముట్టని జీవి కాకి మాత్రమే అని చాలా మందికి తెలియదు.

అంతే కాకుండా సూర్యగ్రహణానికి ముందు గ్రహణం పూర్తి అయ్యాక స్నానం చేసే ఏకైక పక్షి కాకి.

గ్రహణం తర్వాత తన గూడును శుభ్రం చేసుకునే పక్షి కాకి.కావు కావు అని శబ్దం చేస్తూ ఈ బంధాలు, సిరిసంపదలు ఏవి నీవి కావు, ఏమి శాశ్వతము కావు అని అందరికీ కాకి గుర్తు చేస్తూ ఉంటుంది.

"""/" / అందుకే కాకిని కాలజ్ఞాని అని కూడా పిలుస్తారు.కాకులు ఎక్కడైనా ఆహారం కనిపిస్తే తోటి కాకులను పిలిచి కలిసిమెలిసి తింటాయి.

నాలుగు మెతుకులు అయినా పంచుకొని తినాలని కాకుల్ని చూసి మనిషి నేర్చుకోవచ్చు.అలాగే ఒక కాకి ప్రమాదవశాత్తు మరణిస్తే తోటి కాకులు చుట్టూ చేరి అరుస్తాయి.

చనిపోయిన కాకికి తమ అరుపులతో సంతాపం ప్రకటించి స్నానం చేస్తాయి.సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే మంచి అలవాటు సమయపాలన కాకులదే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అంతేకాకుండా సూర్యాస్తమయం తర్వాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులకు ఉంది.పచ్చని ప్రకృతిని విస్తరించి పరిరక్షించడంలో కాకుల పాత్ర ప్రముఖమైనది.

"""/" / ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ ఉంటాయి.

కానీ ప్రస్తుతం భూమి మీద కాకులు అంతరించిపోతున్న దశలో ఉన్నాయి.ఒకప్పుడు ఎక్కడపడితే అక్కడ కాకి కనిపించేది.

అటువంటిది ఇప్పుడు పెద్దలకు శ్రద్ధ కర్మలు చేస్తే, పిండ ప్రధానం( Pinda Pradanam ) చేస్తే వాటిని ముక్కుతో ముట్టడానికి కూడా కాకులు కనిపించడం లేదు.

కాకి రూపంలో మరణించిన పెద్దలు తిరుగుతుంటారని ఒక నమ్మకం కూడా ప్రజలలో ఉంది.

సాక్షాత్తు యమధర్మ రాజే వాటికి ఆ వరం ఇచ్చినట్లుగా కూడా ఒక పురాణ కథ ఉంది.

మైక్ టైసన్‌ను భుజాలపై ఎత్తుకున్న వ్యక్తి.. తర్వాతేమైందో మీరే చూడండి..?