ఆర్ఆర్ఆర్ మూవీ అతిపెద్ద డిజాస్టర్.. బాలీవుడ్ క్రిటిక్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఆర్ఆర్ఆర్ మూవీ భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది.బాలీవుడ్ ఇండస్ట్రీలో బాహుబలి సిరీస్, పుష్ప సినిమాల తర్వాత ఆర్ఆర్ఆర్ మూవీ సత్తా చాటుతోంది.తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ రన్ లో ఆర్ఆర్ఆర్ 200 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది.బాహుబలి2 రిలీజ్ సమయానికి ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ సమయానికి ప్రేక్షకుల ఆలోచనల్లో, అభిరుచుల్లో చాలా మార్పులు వచ్చాయి.

 Bollywood Critic Shocking Comments About Rrr Movie Details Here , Bollywood Crit-TeluguStop.com

పలు ఏరియాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ బాహుబలి 2 క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేయడం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అయితే ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి బాలీవుడ్ క్రిటిక్స్ లో ఒకరైన కమల్ ఆర్ ఖాన్ ఈ సినిమా గురించి నెగిటివ్ గా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ మూవీని తెరకెక్కించినందుకు రాజమౌళిని జైలులో పెట్టాలంటూ కమల్ ఆర్ ఖాన్ గతంలో షాకింగ్ కామెంట్లు చేశారు.

అయితే తాజాగా కమల్ ఆర్ ఖాన్ ఆర్ఆర్ఆర్ మూవీ అతిపెద్ద డిజాస్టర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Telugu Baahubali, Rajamouli, Kamal Khan, Ram Charan, Rrr, Rrr Disaster-Movie

ఆర్ఆర్ఆర్ మూవీకి బాహుబలి సిరీస్ కు పెట్టిన బడ్జెట్ తో పోల్చి చూస్తే రెట్టింపు బడ్జెట్ పెట్టారని అయితే ఆర్ఆర్ఆర్ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్లను పరిశీలిస్తే గడిచిన పదేళ్లలో అతిపెద్ద డిజాస్టర్ ఈ సినిమా అని అనిపిస్తోందని కమల్ ఆర్ ఖాన్ అన్నారు.గతంలో కూడా పలు వివాదాల ద్వారా కమల్ ఆర్ ఖాన్ వార్తల్లో నిలిచారు.

Telugu Baahubali, Rajamouli, Kamal Khan, Ram Charan, Rrr, Rrr Disaster-Movie

టాలీవుడ్ డైరెక్టర్లు తెరకెక్కించిన సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో అంచనాలకు మించి కలెక్షన్లను సాధిస్తుంటే కొంతమంది జీర్ణించుకోలేక ఈ తరహా కామెంట్లు చేస్తున్నారని ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ చెబుతున్నారు.మనసులో దురుద్దేశం ఉంచుకుని కామెంట్లు చేసే క్రిటిక్స్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చరణ్, తారక్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube