అతను ఓ పెద్ద హీరో… హీరో కాదు నిర్మాత.కాదు కాదు హీరో నే.
సరే ఏదో ఒకటి లేండి.ఒకప్పుడు యువ హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.
తెలుగులోనే కాదు హిందీలోనూ వరుస సినిమాలు చేశాడు.అక్కడ మంచి గుర్తింపు వచ్చింది.
నటుడిగా అయితే గుర్తింపు సంపాదించుకున్నాడు గాని స్టార్ హీరోగా మాత్రం ఎదగలేక పోయాడు.ఇక ఆ తర్వాత తన లక్ ను పరీక్షించుకునేందుకు నిర్మాతగా కూడా అవతారమెత్తాడు.
కానీ నిర్మాతగా కూడా అంతగా సక్సెస్ కాలేకపోయాడు.ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నట్లుగానే కొనసాగుతున్నాడు.
అయితే సినిమాలతో హాట్ టాపిక్ గా మారకపోయినా ఎప్పుడూ ఏదో ఒక క్రైం లో ఇరుక్కునీ హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటాడు.
పాపం ఇప్పుడు కూడా ఈ హీరో కమ్ నిర్మాత మరోసారి క్రైమ్ కేసు తో హాట్ టాపిక్ గా మారిపోయాడు.
ఇంతకీ హీరో ఎవరు అనుకుంటున్నారు కదా.తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించి ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించిన సచిన్ జోషి.మౌనమేలనోయి అనే సినిమాతో తెలుగు తెరపై హీరోగా పరిచయమయ్యాడు.ఆ తర్వాత నిన్ను చూడక నేనుండలేను, ఒరేయ్ పండు లాంటి సినిమాల్లో కూడా నటించాడు.ఇక బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి అక్కడ కొన్ని సినిమాలు చేశాడు.ఇక ఎన్ని సినిమాలు చేస్తే ఏం లాభం ప్రేక్షకుల ఆదరణ మాత్రం పొందలేకపోయాడు.

కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా అక్రమాస్తుల కేసులో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయాడు.మనీ ల్యాండరింగ్ కేసులో సచిన్ జోషి కి సంబంధించి 410 కోట్లను ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ అధికారులు ఇటీవలే ఈ హీరో కి షాక్ ఇచ్చారు.ఇక ఇటీవల ఈడీ అధికారులు జప్తు చేస్తున్న ఆస్తుల్లో 330 కోట్ల విలువైన ఆస్తులు ఓంకార్ గ్రూప్ కి చెందినవి కాగా.మిగిలిన 80 కోట్ల ఆస్తులు హీరో సచిన్ జోషి కి చెందిన వైకింగ్ గ్రూప్ కంపెనీలకు సంబంధించినది కావడం గమనార్హం.
ఈ విషయాన్ని ఈడి అధికారులు అధికారికంగా తెలిపారు.ఎస్ ఆర్ఏ ప్రాజెక్టులో ఓంకార్ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలు ఎన్నో ఎదుర్కొంది.ఈ క్రమంలోనే ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించగా చివరికి సచిన్ జోషి తో కూడా సంబంధాలు ఉన్నట్లు తేలింది.దీంతో ఆ దిశగా దర్యాప్తు జరిపిన ఈడీ అధికారులు ఈ సినిమా హీరో కి షాక్ ఇచ్చారు.
ఆస్తులను సీజ్ చేశారు.అయితే గతంలో ఇదే కేసులో హీరో సచిన్ జోషి నీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేసిన విషయం ఇప్పటికీ మరచిపోలేరు ఫ్యాన్స్.
అంతలోనే ఇలాంటి ఘటన జరగడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.