బుల్లితెర నటీనటులుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు అమర్ దీప్ చౌదరి (Amardeep Chowdary)తేజస్విని గౌడ(Tejaswini Gowda) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వీరిద్దరూ బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక వీరిద్దరూ గత మూడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
వివాహం తర్వాత కూడా వరుస సీరియల్స్ బుల్లితెర కార్యక్రమాలతో పాటు అమర్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.అయితే గత కొంతకాలంగా అమర్ తేజు వైవాహిక జీవితం గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

వీరిద్దరి మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలు కారణంగా విడాకులు(Divorce) తీసుకుని విడిపోబోతున్నారు అంటూ వార్తలు హల్చల్ చేశాయి అయితే ఈ వార్తలపై తాజాగా తేజు స్పందించారు.ప్రస్తుతం ఈమె జబర్దస్త్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్న కిస్సిక్ టాక్ షోలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా వీరి విడాకుల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ క్రమంలోనే తేజు మాట్లాడుతూ… భార్యాభర్తలు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు బేధాభిప్రాయాలు రావడం సాధారణం.
అంతమాత్రాన విడాకులు తీసుకొని ఎవరూ కూడా విడిపోరు.మా ఇద్దరి మధ్య కూడా ఇలాంటి చిన్న చిన్న గొడవలే ఉన్నాయని తెలిపారు.

ఇలా చిన్న గొడవలకే విడాకులు తీసుకొని విడిపోతున్నాము అంటూ వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని ఇవన్నీ కూడా అవాస్తవం అంటూ విడాకుల వార్తలను కొట్టి పారేశారు అదేవిధంగా తమ వైవాహిక జీవితంలో మేము చాలా సంతోషంగా ఉన్నాము అమర్ నన్ను చాలా ప్రేమిస్తున్నారు.అంతకంటే ఎక్కువగా నేను అమర్ ను ఇష్టపడుతున్నానని తెలిపారు.అంతేకాకుండా అభిమానులకు తేజు మరొక శుభవార్తను కూడా తెలిపారు.త్వరలోనే పండంటి బిడ్డ కూడా మా జీవితంలోకి రాబోతున్నారు అంటూ ఈమె శుభవార్తను తెలియజేయడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.