నాకు గుడి కట్టి పూజలు చేయండి... బాలయ్య బ్యూటీ వింత కోరిక!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లకు ఇటీవల కాలంలో అభిమానులు కుడి కట్టి పెద్ద ఎత్తున పూజలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇప్పటికే కుష్బూ హన్సిక సమంత నమిత వంటి హీరోయిన్లకు అభిమానులు గుడులు కట్టి పూజలు చేస్తూ వచ్చారు.

 Urvashi Rautela Asks To Bulid Temple For Me In South States , Urvashi,rautela, T-TeluguStop.com

అయితే తాజాగా మరో నటి నాకు కూడా గుడి కట్టి పూజలు చేయండి అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి.మరి గుడి కట్టమని కోరిన ఆ ముద్దుగుమ్మ ఎవరు అనే విషయానికొస్తే ఆమె మరెవరో కాదు దబిడి దిబిడి దంచుబాల అంటూ ప్రేక్షకులను సందడి చేసిన నటి ఊర్వశి రౌతేలా(Uravashi Rautela) అని చెప్పాలి.

Telugu Bollywood, Rautela, Temple, Urvashi, Urvashirautela-Telugu Top Posts

డాకు మహారాజ్, వాల్తేర్ వీరయ్య, స్కంద( Daku Maharaj, Walther Veeraiah, Skanda ) సినిమాలలో ఐటం సాంగ్స్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.అయితే సోషల్ మీడియాలో కూడా ఈమె ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.వెండితెరపై హీట్ పుట్టించే ఊర్వశి.ఆఫ్ స్క్రీన్ లో తన నోటి దురదతో వివాదాలు కోరి తెచ్చుకుంటుంది.

Telugu Bollywood, Rautela, Temple, Urvashi, Urvashirautela-Telugu Top Posts

తాజాగా ఊర్వశి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ’ నార్త్ ఇండియాలో నా పేరు మీద ఓక గుడి(Temple) ఉంది.బద్రీనాథ్ టెంపుల్ పక్కన ఉన్నఊర్వశి టెంపుల్ నా కోసం కట్టారు.ఇలా నార్త్ లో లాగే సౌత్ ఇండస్ట్రీలో కూడా నాకోసం ఒక గుడి కట్టి పూజలు చేయండి అంటూ ఈమె మాట్లాడారు.

దీంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.పైత్యం ఎక్కువైతేనే ఇలాంటి మాటలు వస్తాయి అంటుకొందరు కామెంట్లు చేయగా మరికొందరు గుడి అనేది అభిమానంతో కట్టేది ఇలా అడిగిమరీ కట్టించుకునేది కాదు అంటూ కూడా విమర్శలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube