రంగస్థలం సినిమాలో హీరోయిన్ గా చేయాలని అనుపమ పరమేశ్వర్ ను అడిగారట.తను కూడా ఓకే చెప్పిందట.
సినిమా యూనిట్ అఫీషియల్ గా ప్రకటన కూడా చేసింది.రాం చరణ్ సరసన అనుపమ హీరోయిన్ గా చేస్తుందని చెప్పింది.
కారణాలు ఏంటో కానీ.చివరకు సమంతా ఈ సినిమాలో నటించింది.
ఇదొక్కటే కాదు చాలా సినిమాల్లో తొలుత ఒక హీరోయిన్ అనుకున్నా పలు కారణాలతో చివరకు మరో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది.ఈ మధ్య కాలంలో ఫస్ట్ ఒక హీరోయిన్ పలానా రోల్ కి అనుకున్నా తర్వాత మరో హీరోయిన్ వచ్చి ఆ ప్లేస్ చేరిన సందర్భాలున్నాయి.
అయితే ఇంతకీ అలా మార్పులు జరిగిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
రంగస్థలంఈ సినిమాలో మొదట అనుపమ పరమేశ్వర్ ను హీరోయిన్ గా తీసుకున్నారు.
కారణాలు తెలియదు కానీ చివరకు సమంతా ఇందులో నటించింది.
నారాప్పవెంకటేష్ తాజా రీమేక్ మూవీ నారప్పలో మొదట అనుష్క శెట్టిని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు.
కానీ ప్రియమణి ఫైనల్ గా ఖరారు చేశారు.
రాజుగారి గది

ఈ సినిమాలో మొదట తమన్నాను అనుకున్నారు.కానీ చివరకు అవికా గోర్ హీరోయిన్ గా చేసింది.
చెలియాఈ సినిమాలో సాయిపల్లవిని హీరోయిన్ గా చేయాలని కొరారట.
కానీ చివరకు అదితిరావు హైదరి నటించింది.
జెర్సీ-హిందీ

మొదట రశ్మిక మందాన అనుకున్నా.మ్రునాల్ థాకూర్ నటించింది.
వీటీ10

వరుణ్ తేజ్ 10వ వీలో కైరా అద్వానీని హీరోయిన్ గా చేయాలని కోరారు.కానీ సాయి మంజురేకర్ నటించింది.కొచ్చాడియన్ఈ సినిమాలో అనుష్కను హీరోయిన్ గా అనుకున్నా దీపికా పదుకొనే ఫైనల్ అయ్యింది.
గీతా గోవిందంఈ సినిమాలో తొలుత రకుల్ ప్రీత్ సింగ్ అనుకున్నారు.కానీ రశ్మిక ఓకే అయ్యింది.
రాక్షసుడు

ఈ సినిమాలో రాశీ ఖన్నాను అనుకున్నా అనుపమ పరమేశ్వర్ ఓకే అయ్యింది.
అందాదున్ రీమేక్

మొదట ఈ సినిమాలో పూజా హెగ్డేను అనుకున్నా.నబ్బా నటేష్ ఫైనల్ అయ్యింది.
మహానటిఈ సినిమాలో మొదట నిత్యా మీనన్ అనుకున్నా.
చివరకు కీర్తి సురేష్ ఓకే అయ్యింది.
జెంటిల్ మెన్

ఈ మూవీలో నిత్యా మీనన్ నటించాలి అనుకున్నా సురభి ఫైనల్ అయ్యింది.
అమర్ అక్బర్ ఆంటోనీఈ సినిమాలో కాజల్ ను అనుకున్నా ఇలియానా నటించింది.