ప్రస్తుత రోజుల్లో చాలా మంది మేకప్ కి బాగా అలవాటు పడిపోయారు.మేకప్ లేనిదే బయట కాలు పెట్టడానికి కూడా కొందరు ఇష్టపడటం లేదు.
కానీ మేకప్ వేసుకోవడానికి వినియోగించే ఉత్పత్తుల్లో ఎన్నో రకాల కెమికల్స్ ఉంటాయి.అవి మన చర్మానికి తీవ్ర హాని కలిగిస్తాయి.
చర్మ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి.అందుకే సహజంగానే అందంగా మెరిసి పోవడానికి ప్రయత్నించాలి.
అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే చిట్కా సూపర్ ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక ఆరెంజ్ పండును తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడగాలి.ఆ తర్వాత తొక్క తొలగించకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే అర అంగుళం అల్లం ముక్కను తీసుకుని పొట్టు తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆరెంజ్ పండు ముక్కలు, అల్లం ముక్కలు వేసుకోవాలి.

అలాగే అర కప్పు రోజ్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి పల్చటి వస్త్రం సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో రెండు చుక్కలు స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తే మ్యాజికల్ సీరం సిద్ధమవుతుంది.ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు వాడుకోవచ్చు.

ఉదయం స్నానం చేయడానికి గంట ముందు మరియు నైట్ నిద్రించే ముందు దూది సాయంతో తయారు చేసుకున్న సీరంను ముఖానికి ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకోవాలి.తద్వారా మొండి మచ్చలు, మొటిమలు, మాయమవుతాయి.వృద్ధాప్య లక్షణాలు త్వరగా దరి చేరకుండా ఉంటాయి.చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.ఈ హోమ్ మేడ్ సీరంను వాడితే మేకప్ అక్కర్లేదు సహజంగానే అందంగా, ఆకర్షణీయంగా మెరిసిపోతారు.