వారానికి ఒకసారి ఈ మ్యాజికల్ సీరంను వాడితే వద్దన్నా మీ జుట్టు దట్టంగా పెరుగుతుంది!

మనలో కొందరి జుట్టు ( Hair ) చాలా పల్చగా ఉంటుంది.పల్చటి జుట్టు( Thin Hair ) అందాన్ని తగ్గిస్తుంది.

 Using This Magical Serum Will Make Your Hair Grow Thicker Details! Magical Serum-TeluguStop.com

అందులో ఎటువంటి సందేహం లేదు.అందుకే జుట్టును ఒత్తుగా మార్చుకునేందుకు ఖరీదైన ఆయిల్, షాంపూ తదితర ఉత్పత్తులను వాడుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉంటే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం ను ప్రయత్నించండి.ఈ సీరం ను వారానికి ఒక్కసారి వాడితే.

వద్దన్నా కూడా మీ జుట్టు దట్టంగా పెరుగుతుంది.మరి లేటెందుకు ఆ సీరంను( Serum ) ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఓ లుక్కేసేయండి.

ముందుగా రెండు నిమ్మ పండ్లు తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి తొక్క ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో నిమ్మ పండు తొక్కలు( Lemon Peel ) వేసుకోవాలి.అలాగే అర కప్పు ఎండిన గులాబీ రేకులు,( Dry Rose Petals ) ఐదు లవంగాలు( Five Cloves ) వేసి కనీసం 15 నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Serum, Healthy, Homemade Serum, Latest, Lemon Peel, Long

ఇప్పుడు ఈ వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, ( Aloevera Gel ) వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె, ( Mustard Oil ) వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన సీరం సిద్ధం అవుతుంది.ఈ సీరం ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి.

ఆపై షవర్ క్యాప్ ధరించాలి.

Telugu Care, Care Tips, Serum, Healthy, Homemade Serum, Latest, Lemon Peel, Long

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ సీరం ని వాడిన చాలు.అదిరిపోయే రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

లెమన్ పీల్ మరియు గులాబీ రేకుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఈ వంటి పోషకాలు ఉంటాయి.ఇవి జుట్టు ఎదుగుదలను చక్కగా ప్రోత్సహిస్తాయి.

అందువ‌ల్ల‌ ఇప్పుడు చెప్పుకున్న సీరం ను వాడితే మీ కురులు ఒత్తుగా పెరుగుతాయి.అదే సమయంలో హెయిర్ ఫాల్‌ దూరం అవుతుంది.

కురులు ఆరోగ్యంగా దృఢంగా మారతాయి.చుండ్రు సమస్య సైతం పరార్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube