ఈ న్యాచురల్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ గ్లో..!

తమ ముఖ చర్మం సూపర్ గ్లోయింగ్ గా మెరిసిపోతూ కనిపించాలని ఆడవారు ఎంతగానో కోరుకుంటారు.అటువంటి చర్మాన్ని పొందడానికి రకరకాల స్కిన్ కేర్ ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతుంటారు.

 Your Skin Will Be Super Glowy With This Natural Night Cream! Night Cream, Natura-TeluguStop.com

నెలకు ఒకసారైనా బ్యూటీ పార్లర్ కు వెళ్లి స్కిన్ కోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే సూపర్ గ్లోయింగ్ స్కిన్ ( Super glowing skin )ను మీ సొంతం చేసుకోవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ నైట్ క్రీమ్ ఉత్తమంగా సహాయపడుతుంది.

Telugu Tips, Face Cream, Skin, Homemade Cream, Latest, Natural Cream, Skin Care,

అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో పీల్ తొల‌గించిన మూడు బీట్ రూట్ స్లైసెస్( Beet root slices ), గుప్పెడు ఫ్రెష్ గులాబీ రేకులు( fresh rose petals ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, ( aloe vera gel )వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) , హాఫ్ టీ స్పూన్ బాదం ఆయిల్ వేసుకొని ఐదు నిమిషాల పాటు స్పూన్ సహాయంతో మిక్స్ చేస్తే మన క్రీమ్ అనేది రెడీ అవుతుంది.

Telugu Tips, Face Cream, Skin, Homemade Cream, Latest, Natural Cream, Skin Care,

ఒక బాక్స్ లో ఈ క్రీమ్ ను నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ప్రతిరోజు నైట్ నిద్రించే ముందు ఈ న్యాచురల్ క్రీమ్ ను ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.రెగ్యుల‌ర్ గా ఈ క్రీమ్ ను కనుక వాడితే చర్మం చాలా కాంతివంతంగా మారుతుంది.అందంగా మెరుస్తుంది.పొడి చర్మం సమస్య దూరం అవుతుంది.స్కిన్ హైడ్రేట్ గా ఉంటుంది.

అలాగే ఈ క్రీమ్ స్కిన్ కలర్ ను ఇంప్రూవ్ చేస్తుంది.పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేస్తుంది.

కాబట్టి అందమైన మెరిసే చర్మాన్ని కోరుకునేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న క్రీమ్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube