కన్యాశుల్కం… గురజాడ అప్పారావు రాసిన అద్భుత నాటకం.ఈ నాటకం ఆధారంగా 1955లో సినిమా వచ్చింది.
ఈ సినిమా తొలుత జనాలను అంతగా ఆకట్టుకోలేదు.కానీ ఆ తర్వాత జనాల్లోకి విపరీతంగా వెళ్లింది.
వంద రోజుల వేడుకలు జరుపుకుని నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది.ఈ సినిమాకు పి.పుల్లయ్య దర్శకత్వం వహించాడు.ఇందులో మధురవాణి పాత్రలో సావిత్రి ఒదిగిపోయింది.
గరీశంగా ఎన్టీఆర్.రామప్ప పంతులుగా సీఎస్సార్ ఆంజనేయులు, లుబ్దావధాన్లుగా గోవిందరాజుల సుబ్బారావు నటించారు.
మరో కీలక పాత్ర అయిన బుచ్చమ్మ క్యారెక్టర్ షావుకారు జానకీ నటించింది.బాల్య వివాహం కావడంతో చిన్నతనంలోనే భర్తను కోల్పోయి.వితంతువుగా మారిన క్యారెక్టర్ ఆమె చేసింది.జనాలను జానకీ తన నటనతో అద్భుతంగా ఆకట్టుకుంది.
వాస్తవానికి ఈ సినిమాలో బుచ్చమ్మ పాత్రను జానకీ చేత చేయించాలి అనుకోలేదు దర్శకుడు పుల్లయ్య.ఆ పాత్రకు జమున కరెక్ట్ అనుకున్నాడు.కానీ ఆమె తండ్రి చాదస్తం మూలంగా చక్కటి అవకాశం కోల్పోయింది.అప్పుడే సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది జమున.అదే సమయంలో కన్యాశుల్కం సినిమాలో బుచ్చమ్మ పాత్రను ఆమె చేత చేయించాలి అనుకున్నారు కన్యాశుల్కం నిర్మాత నారాయణ. ఆమెను ఈ సినిమాలో నటించాలని అడగడం కోసం తన ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు.
అయితే తనను ఓ మంచి రోజు చూసుకుని రమ్మని చెప్పాడు జమున తండ్రి.
నిర్మాత నారాయణ తమ ఇంటికి వచ్చే రోజు జమున తండ్రి ఆమెతో ఓ మాట చెప్పాడు.అమ్మాయ్.ఆ నిర్మాత నారాయణ చాలా డేంజర్ మనిషట.
అతడితో మనం సినిమాలు చేయకూడదు.తను వచ్చాక.
ఒక్క నిమిషం కూర్చుని పని ఉందని చెప్పి లోపలికి వెళ్లిపోవాలన్నాడు.అంతలోనే నారాయణ వచ్చాడు.
తన తండ్రి చెప్పినట్లో ఒక్క నిమిషం మాట్లాడి.నమస్కారం పెట్టి.
లోపలికి వెళ్లిపోయింది.జమున తండ్రి కూడా నారాయణకు కాఫీ ఇచ్చి మర్యదగానే మాట్లాడారు.
ఆయన వితంతు వేషం అని చెప్పగానే.మా అమ్మాయి బిజీగా ఉంది.
వితంతు వేషం సెంటిమెంటల్ గా ఇష్టం లేదు అని చెప్పాడట.దీంతో నారాయణ అక్కడి నుంచి వచ్చేశాడు.
తన తండ్రి చాదస్తం కారణంగా జమున పలు సినిమా అవకాశాలు కోల్పోయినట్ల ఒక సందర్భంలో ఆమే స్వయంగా చెప్పింది.