ఆరోగ్యమైన ఒత్తైన జుట్టు కోసం బెస్ట్ ప్రోటీన్ మాస్క్ ఇది!

ఆరోగ్యమైన జీవితాన్ని గడపాలంటే మన శరీరానికి అందించాల్సిన ముఖ్యమైన పోషకాల్లో ప్రోటీన్ అనేది.అయితే ఒంటికే కాదు జుట్టుకు( Hair ) కూడా ప్రోటీన్ చాలా అవసరం.

 This Is The Best Protein Mask For Healthy Thick Hair! Healthy Hair, Thick Hair,-TeluguStop.com

ప్రోటీన్ ఆరోగ్యమైన జుట్టుకు మద్దతు ఇస్తుంది.జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

అనేక కేశ సంబంధిత సమస్యలకు అడ్డుకట్ట వేస్తుంది.అందుకే అప్పుడప్పుడు ప్రోటీన్ హెయిర్ మాస్క్ లను ప్రయత్నిస్తూ ఉండాలి.

ఆరోగ్య‌మైన మ‌రియు ఒత్తైన జుట్టును కోరుకునే వాడికి ఇప్పుడు చెప్పబోయే ప్రోటీన్ మాస్క్ ది బెస్ట్ గా వ‌ర్కోట్ అవుతుంది.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఉసిరికాయ పొడి( Amala powder ) వేసుకోవాలి.

అలాగే పావు కప్పు ఫ్రెష్ కొబ్బరి పాలు( Fresh coconut milk ), వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive oil ), వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe vera gel ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.చివరిగా ఒక ఎగ్ వైట్ ను కూడా అందులో వేసి మరోసారి కలుపుకోవాలి.

Telugu Care, Care Tips, Latest, Protein, Thick, Proteinhealthy-Telugu Health

ఇలా త‌యారు చేసుకున్న‌ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ ప్రోటీన్ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారు.కొబ్బరి పాలు జుట్టు రాలడాన్ని అరికట్టడమే కాకుండా కావాల్సిన తేమ మరియు పోషణ అందిస్తాయి.

Telugu Care, Care Tips, Latest, Protein, Thick, Proteinhealthy-Telugu Health

అలాగే గుడ్డులో ఉండే ప్రోటీన్ మరియు ఇతర పోషకాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.ఆవనూనె జుట్టు ఆరోగ్యంగా బలంగా ఎదిగేందుకు తోడ్పడుతుంది.ఉసిరి జుట్టు రాలడాన్ని ఆపుతుంది.తెల్ల జుట్టు త్వరగా రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.జుట్టు నుండి మురికి, బ్యాక్టీరియా మరియు సూక్ష్మక్రిములను తొలగిస్తుంది.

ఇక కలబంద చుండ్రును దూరం చేస్తుంది.కేశాలను మృదువుగా ఆరోగ్యంగా మారుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube