నిద్ర ఆరోగ్యానికి మంచిది అనే విషయం తెల్సిందే.కాని అతి నిద్ర ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అంటూ ప్రముఖ అమెరికన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు.
రోజులో 12 గంటలకు మించి పడుకునే వారిపై గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యకర విషయాన్ని గుర్తించారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఏ సమయంలో పడుకుంటున్నారో ఏ సమయంలో మేలుకువతో ఉంటున్నారో అర్థం కాని పరిస్థితి.
అలాంటి నిద్ర ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావంను చూపిస్తుందని వారు అంటున్నారు.
ముఖ్యంగా మద్యాహ్నం సమయంలో ఏదైనా కష్టం చేసి కాసేపు పడుకుని మళ్లీ వెంటనే లేస్తే పర్వాలేదు.కాని ఎక్కువ సమయం పడుకుని ఉంటే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సందర్బంగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.నిద్ర ఆరోగ్యంకు మంచిదే అయినా అతి నిద్ర, నిర్ధిష్ట సమయం పాటించని నిద్ర ఎట్టి పరిస్థితుల్లో ఆమోద యోగ్యం కాదని వారు చెబుతున్నారు.
మద్యాహ్నం 90 నిమిషాల కంటే ఎక్కువ సమయం నిద్రించడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.మద్యాహ్నం సమయంలో 20 నుండి 30 నిమిషాలు పడుకుని లేచే వారితో పోల్చితే 90 నిమిషాల కంటే ఎక్కువ పడుకునే వారికి అనారోగ్య సమస్యలు ఎక్కువ అంటూ నిపుణులు చెబుతున్నారు.
రోజులో ఎక్కువ సమయం పడుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకు పోతుందని, నిద్ర పోయిన సమయంలో కొవ్వు అలాగే ఉండి పోవడం వల్ల స్థూలకాయం మరియు ఉబకాయం వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఆరోగ్యవంతమైన నిద్ర కేవలం రాత్రి సమయంలోనే అని, అది కూడ 7 నుండి 10 గంటల వరకు మాత్రమే.వయసును బట్టి వారి అవసరాన్ని బట్టి నిద్ర పోవాలి తప్ప ఎక్కువ నిద్ర పోవడం మంచిది కాదు.పెద్దలు అతి అనర్థం అంటారు.ఆ సామెత నిద్రకు కూడా వర్తిస్తుందని తాజాగా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెళ్లడయ్యింది.