Pooja Utensils: పూజలో ఈ పాత్రలను ఉపయోగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఇంటిపై ఉంటుందా..

మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఇంట్లో కానీ, దేవాలయంలో కానీ దేవుడికి పూజ చేసే ముందు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు.పూజలో మనకు తెలియకుండా కొన్ని చిన్న చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి.

 If These Utensils Are Used In Pooja Goddess Lakshmi Blessings Will Be On The Hou-TeluguStop.com

పూజలో ఉపయోగించే పాత్రలు ఏ లోహంతో తయారు చేసినావో తెలుసుకొని ఉపయోగించడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది.అయితే పూజలో ఎలాంటి పాత్రను ఉపయోగించడం వల్ల మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

బంగారం, వెండి, ఇత్తడి, రాగితో చేసిన పాత్రల విగ్రహాలు చాలా పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు.రాగి పాత్రలలో నీరు త్రాగుతూ ఉండడం మంచిది.

పంచామృత కోసం వెండి పాత్రలను ఉపయోగించాలి.పంచామృతాన్ని వెండి చెంచాలో ఇవ్వడం మంచిది.

దేవుని ప్రతిష్ట చేయడానికి వెండి పళ్లెం ఉపయోగించాలి.పూజ సామాగ్రి ఉన్న ప్లేటు వెండి లేదా ఇత్తడి తో ఉండేలా చూసుకోవడం ఉత్తమం.కొన్ని ప్రదేశాలలో మాత్రమే బంగారంతో తయారు చేసిన పాత్రలను ఉపయోగిస్తూ ఉన్నారు.వెండి పాత్రలలో అభిషేకం చేయడం వల్ల ఆ ఇంటికి ఎంతో శుభం జరుగుతుంది.

మట్టి లేదా ఇత్తడితో చేసిన దీపాలను పూజలో ఉపయోగించాలి.బంగారం అనేది చాలా పవిత్రమైన లోహం బంగారాన్ని ధరించడం వల్ల ఆరోగ్యం, శ్రేయస్సు, అభివృద్ధి లాంటివి లభిస్తాయి.

బంగారాన్ని ధరించడం వల్ల మనిషి ఆరోగ్యంగా దీర్ఘాయు పొందుతాడు.

Telugu Bakti, Copper Utensils, Deepawali Pooja, Devotional, Goddess Lakshmi, Gol

అలాగే వెండి లేదా రాగి పాత్రలలో బంగారాన్ని కాసేపు ఉంచి తాకితే అది బంగారు ప్రార్థన అవుతుంది.దీపావళి పూజలో బంగారు నాణేలు లేదా ఆభరణాలు ఎంతో ముఖ్యమైనవి.ఒక వ్యక్తి జాతకంలో దోషం ఉంటే మాత్రం ఇత్తడిని ఉపయోగించడం మంచిది.

ఇత్తడి పాత్రలో తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.పూజలో ఇత్తడి పల్లెము ఉపయోగించడం వల్ల ఆ ఇంట్లో శుభం జరుగుతుంది.

రాగి పాత్రలో నీరు త్రాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఎందుకంటే రాగికి నీటిని శుద్ధి చేసే గుణం ఉంది.

దీనివల్ల అనేక వ్యాధులు దూరం అయ్యే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube