నేరేడు పండ్లతో ఇలా చేస్తే శని దోష నివారణలు దూరం..!

శని దోష నివారణకు నేరేడు పండ్లు( Jamun Fruit ) ఎంతగానో ఉపయోగపడతాయని చాలామందికి తెలియదు.మనం దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడడానికి శని యొక్క సడే సతి కారణమని చెబుతూ ఉంటారు.

 If You Do This With Jamun Fruit Shani Dosha Cures Will Go Away..!,jamun Fruit-TeluguStop.com

ఇంకా చెప్పాలంటే నేరేడు పండ్లు తింటే కడుపులో ఉండే మలినలు శుభ్రం కావడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.నేరేడు పండ్లు మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి( Immunity )ని పెంచడమే కాకుండా వ్యాధి తీవ్రతను కూడా తగ్గిస్తాయి.

మూత్ర సంబంధమైన వ్యాధుల నుంచి కూడా ఉపశమనాన్ని కలిగిస్తాయి.నేరేడు పండు శని దేవుడికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తింటే నడుము నొప్పి, మోకాల నొప్పులు నయమవుతాయి.

అంతేకాకుండా పూజ చేసిన తర్వాత నేరేడు పండును బ్రాహ్మణునికి దానం చేస్తే వివిధ రకాల రోగాల నుంచి త్వరగా బయటపడవచ్చు.నేరేడు పండును శని దేవునికి( Lord shanim ) ఇష్టమైన నల్ల నువ్వులతో కలిపి దానం చేస్తే జీవితంలో శని దోషాలు తొలగిపోతాయి.

Telugu Devotional, Immunity, Jamun Fruit, Lord Shani, Sesame Oil, Shani Dosham-L

దేవుడి పేరుతో పూజించిన నేరడు పండ్లను బిచ్చగాళ్లకు దానం చేస్తే దరిద్రం కూడా దూరమైపోతుంది.అంతేకాకుండా నేరేడు పండును పుణ్యక్షేత్రంలో బ్రాహ్మణులకు తాంబూలంతో పాటు దానం చేస్తే భూదానం చేసినంత ఫలితం వస్తుందని చెబుతున్నారు.అంతేకాకుండా ప్రతిరోజు మనం నేరేడు పండును రోజు ఒకటి చొప్పున తింటే రోగాల నుంచి త్వరగా బయటపడవచ్చు.ఎవరికైనా భోజనం పెట్టేటప్పుడు భోజనంతో పాటు నేరేడు పండ్లను కూడా వడ్డిస్తే మీకు ఎప్పటికీ ధన ధాన్యాలకు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు.

Telugu Devotional, Immunity, Jamun Fruit, Lord Shani, Sesame Oil, Shani Dosham-L

జీవితం పై శని దుష్ప్రభావాలు ఉండకూడదు అంటే నువ్వుల నూనె( Sesame Oil )తో కానీ, ఆముదంతో కానీ శని దేవున్ని పూజించాలి.అలాగే పడమర దిక్కున ఇనుప గరిటలో దీపాన్ని పెట్టి నేరేడు పండు నైవేద్యంగా పెడితే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.నేరేడు పండు శని దోష నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుందని, శని దేవుడికి సమర్పించిన, ఎవరికైనా దానం చేసిన శుభ ఫలితాలు లభిస్తాయి అని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube