ఈ స్మార్ట్ యుగంలో కూడా మనదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జ్యోతిష శాస్త్రాన్ని నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు.దానితోపాటు వాస్తు దోషాలను నమ్మి వాస్తు ప్రకారం చాలామంది ఉన్నారు.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం షమీ చెట్టుకు చాలా శక్తి కలిగి ఉంది.ఈ చెట్టు అనేక రకాల వాస్తు దోషాల నుంచి ఆ ఇంట్లో వారిని రక్షిస్తుంది.
ఈ షమీ చెట్టును శని దేవుడితో సంబంధం ఉందని చాలామంది ప్రజలు నమ్ముతారు.వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్క ఇంట్లో పెంచుతున్నట్లయితే పలు రకాల వాస్తు దోషాల నుంచి విముక్తి పొందవచ్చు.
ఇంకా చెప్పాలంటే ఈ మొక్క ఇంట్లో ఉండడం వల్ల ఆ ఇంటికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.ఈ మొక్క ఇంట్లో పెంచడం వల్ల చాలా రోజుల నుంచి ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలు తగ్గి అందరూ సంతోషంగా ఉండే అవకాశం ఉంది.
అట్లాగే డబ్బుతో ముడిపడి ఉన్న సమస్యలు తొలగిపోతాయి.
అయితే ఇంట్లో ఉండడం వల్ల కుటుంబ సభ్యులందరూ సుఖసంతోషాలతో ఉంటారు.
అదేవిధంగా ఈ మొక్కతో వాస్తు దోషాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.అట్లాగే వైవాహిక జీవితం పట్ల ఎదురుకుంటున్న చాలా రకాల సమస్యలు ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.
శని ప్రభావం పడిన వారి జీవితాలు నాశనం అయిపోవడమే కాకుండా చాలా రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
అలాంటివారు ఇంట్లో నాటి పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.శని మొక్కను శనివారం నాడు ఇంట్లో ఉండడంవల్ల అనేక ఫలితాలు కలగవచ్చు.దసరా పండుగ రోజున కూడా ఈ మొక్కను ఇంట్లో నాటుకోవచ్చు.
షమీ మొక్కను ఇంటి ఎంట్రన్స్ దగ్గర నాటడం వల్ల ఈ ఇంట్లో ఉన్న వారందరికీ అదృష్టం వరుస్తుంది.మీరు ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు మీ కుడిచేతివైపుండేలా నాటుకోవడం మంచిది.
ఇంటి పైకప్పు పై నాటితే మాత్రం దక్షిణం మూలన ఉండేలా నాటాలి.