భూత, పిశాచా,ప్రేత భయాలు దూరం చేసే దేవుడిగా ఆంజనేయ స్వామిని ఎక్కువ మంది ప్రజలు పూజిస్తారు.ఏవైనా పీడకలలు, దయ్యాలు కలలోకి వచ్చాయి అంటే అందరూ తప్పనిసరిగా హనుమాన్ చాలీసా( Hanuman Chalisa ) పఠిస్తారు.
ఆంజనేయుడి పంచముఖాలు కలిగిన చిత్రం ఇంట్లోని పూజ గదిలో ఉంటే ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.గృహ దోషాల నుంచి బయటపడేందుకు ఎక్కువ మంది పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రాన్ని ఇంట్లోని పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటారు.
ఈ చిత్రం ఇంట్లో ఉంచడం వల్ల దృష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు.పంచముఖ ఆంజనేయ స్వామినీ శక్తివంతమైన దేవుడిగా ప్రజలు నమ్ముతారు.
మీ ఇంటికి రక్షణగా ఈ చిత్రం నిలుస్తుంది. పంచముఖ ఆంజనేయస్వామి( Panchamukhi Anjaneya Swamy ) ఇంటిని దుష్టశక్తులు, ప్రతికూల శక్తుల నుంచి రక్షిస్తాడని భక్తుడు నమ్ముతారు.
ఈ చిత్రం ఇంట్లో ఉంటే ఎటువంటి ఆత్మలు ప్రవేశం చేసే సాహసం చేయవు.ధైర్యం బలాన్ని అందించమని కోరుకుంటూ భక్తులు హనుమంతుడిని పూజిస్తారు.ఈ చిత్రం మీకు ధైర్యం, శక్తినీ ఇస్తుంది.అనేక భయాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది.పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మీ ఇంట్లో సంపద ఎప్పుడూ ఉంటుంది.అలాగే మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు.
శత్రులపై విజయం సాధించేందుకు మీకు ఆంజనేయ స్వామి అండగా నిలుస్తాడు.పంచముఖ ఆంజనేయస్వామిని ఆరాధించడం వల్ల ఆధ్యాత్మికంగానూ బలపడతారు.
అలాగే హనుమంతుడి ఆశీస్సులు పొందడం కోసం ప్రతిరోజు శ్రీరామ నామ జపం( Srirama Nama Japam ) చేయాలని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల మీ కష్టాలన్నీ దూరమైపోతాయి.
తుంగభద్ర నది తీరంలో స్వామి కోసం తపస్సు చేస్తున్న శ్రీ రాఘవేంద్ర స్వామికి( Sri Raghavendra Swamy ) ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయుడుగా దర్శనం ఇచ్చినట్లు పురాణాలలో ఉంది.మీ ఇంట్లో పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రం పెట్టుకోవాలని అనుకున్నప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్తగా పరిశీలించాలి.ఆ చిత్రం ఎంతో స్పష్టంగా ఉండాలి.పూజ గదిలో దాన్ని సరైన స్థానంలో ఏర్పాటు చేసుకోవాలి.ఎప్పటికప్పుడు చిత్రాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి.చిత్రంలో స్వామి ముఖం ఉగ్రరూపం కాకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.
ఆంజనేయులుని మంగళవారం రోజు పూజిస్తే ఆయన ఆశీస్సులు లభిస్తాయి
.DEVOTIONAL