18 మహా పురాణాలలో ఒక్కటైనా గరుడ పురాణం( Garuda Purana )లో మనిషి తన జీవితానికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు.మనిషి ఉదయం నిద్ర( Sleep ) లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఏం చేస్తే మంచిది.
ఏం చేయకూడదు లాంటి ఎన్నో విషయాలను గరుడ పురాణంలో వెల్లడించారు.ముఖ్యంగా చెప్పాలంటే ఉదయాన్నే చేసే కొన్ని పనుల కారణంగా రోజంతా శుభప్రదంగా ఉంటుంది.
మీ జీవితంలో సానుకూలతను తీసుకొని వస్తుంది.గరుడ పురాణంలో మోక్షాన్ని, మోక్ష మార్గాన్ని సూచిస్తుంది.
గరుడ పురాణంలోని నీతి సారా విభాగంలో రోజు వారి జీవితానికి సంబంధించిన అనేక నియమాలు, విధానాలను వెల్లడించారు.

అంతే కాకుండా ఇది ఇతర పనుల గురించి కూడా చెబుతూ ఉంది.కొన్ని ముఖ్యమైన పనులు ఉదయాన్నే చేస్తే జీవితం మెరుగుపడుతుంది.ఈ అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా జీవితాన్ని సుసంపన్నం చేసుకోవచ్చు.
మరి ఆ పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే శరీరం,మనస్సు స్వచ్ఛత కోసం స్నానం చేయాలి.
( Bath ) ప్రతి మనిషి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి స్నానం చేస్తారు.కానీ ఉదయాన్నే నిత్యం స్నానం చేసే మనుషులు రోజంతా శక్తివంతంగా ఉంటారు.
అనేక వ్యాధులకు దూరంగా ఉంటారు.

అలాంటి వారు తమ పనిని కూడా శ్రద్ధగా చేస్తారు.కాబట్టి వారి జీవితంలో శుభ ఫలితాలు వస్తాయి.అంతే కాకుండా ప్రతి వ్యక్తి తన సామర్ధ్యం మేరకు ఎప్పటికప్పుడు దానం( Donation ) చేస్తూ ఉండాలి.
ఒక వ్యక్తి ఉదయాన్నే తన చేతులతో ఏదైనా దానం చేయాలని గరుడ పురాణంలో ఉంది.దీని వల్ల కుటుంబంలో ఎప్పుడు ఆహారానికి,డబ్బుకు లోటు ఉండదు.ఇంకా చెప్పాలంటే ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత పూజ( Pooja ( చేయాలి.ఇంట్లో ధూపం లేదా దీపం వెలిగించాలి.
అలాగే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి.అప్పుడే ఇంట్లోని ప్రతికూల శక్తి ( Negative energy )దూరమైపోతుంది.
ప్రతి రోజు హవానాన్ని నిర్వహించడం సాధ్యం కాకపోతే మీరు తప్పనిసరిగా దీపం వెలిగిస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయి.