కొబ్బరి నూనె.దీని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.
టెంకాయలోని కొబ్బరి నుంచి తయారు చేసే కొబ్బరి నూనెలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి.అందుకే ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి మరియు కేశ సంరక్షణకు కొబ్బరి నూనె అద్భుతంగా సహాయపడుతుంది.
అలాగే ఆయుర్వేద వైద్యంలోనూ కొబ్బరి నూనెను ఉపయోగిస్తాయి.ఇకపోతే గర్భిణీ స్త్రీలకు కొబ్బరి నూనె అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.
అవును ప్రెగ్నెన్సీ సమయంలో వివిధ రకాల సమస్యలను కొబ్బరి నూనెతో నివారించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం గర్భిణీలకు ఏయే విధంగా కొబ్బరి నూనె యూజ్ అవుతుందో చూసేయండి.
ఆపరేషన్ అంటే భయపడే గర్భిణీ స్త్రీలు.నార్మల్ డెలివరీ కావాలనే కోరుకుంటారు.అందు కోసం ఎన్నెన్నో చిట్కాలను పాటిస్తారు.అయితే నార్మల్ డెలివరీకి కొబ్బరి నూనె గ్రేట్‌గా సహాయపడుతుంది.
అవును, కొబ్బరి నూనెతో వండిన ఆహారాలు తీసుకుంటే సహజ కార్పు జరుగుతుంది.రోజూవారి వంటకాల్లో కొబ్బరి నూనెను జోడించి తీసుకుంటే గర్భిణీల శరీర బరువు అదుపులో ఉంటుంది.
మరియు కడుపులోని శిశువు ఎదుగుదల కూడా బాగుంటుంది.

అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో కొందరు మహిళలు రుచిని కోల్పోతుంటారు.దాంతో ఏ ఆహారాలను తీసుకోవడానికి ఇష్టపడరు.అలాంటప్పుడు కొబ్బరి నూనెతో నోటిని పుక్కిలించాలి.
తద్వారా టేస్ట్ బడ్స్ యాక్టివ్‌గా మారతాయి.
గర్భిణీలను తీవ్రంగా వేధించే సమస్య స్ట్రెచ్ మార్క్స్.
అయితే గర్భధారణ తర్వాత కొబ్బరి నూనెతో రోజూ చర్మానికి పట్టించి మసాజ్ చేసుకుంటే స్ట్రెచ్ మార్క్స్ చాలా అంటే చాలా సులభంగా వదిలించుకోవచ్చు.
ఇక ప్రెగ్నెన్సీ సమయంలో అప్పుడప్పుడు కడుపు గట్టిగా పట్టేసినట్టు అయిపోతుంది.
అలాంటప్పుడు గోరు వెచ్చటి కొబ్బరి నూనెను చేతులోకి తీసుకుని కడుపుపై అప్లై చేసుకుని స్మూత్‌గా మసాజ్ చేసుకోవాలి.తద్వారా కడుపు మళ్లీ మామూలుగా మారుతుంది.