పురాణాల ప్రకారం సాక్షాత్తు విష్ణుమూర్తి ఎన్నో అవతారాలు ఎత్తిన సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే సాగర మధనంలో ఉద్భవించిన అమృతాన్ని పంచడం కోసం మోహిని అవతారమెత్తాడు.ఈ క్రమంలోనే శివుడి మోహిని ఇష్టపడడంతో వారికి గల సంతానం అయ్యప్ప జన్మిస్తాడు.
అయితే మరల నారాయణుడు పార్వతి దేవి అవతారమెత్తాడు.ఈ విధంగా పార్వతి దేవి అవతారంలో రావడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
పూర్వం ఒకానొక సమయంలో లక్ష్మీదేవి మానససరోవరంలో స్నానమాడుతుండగా నారాయణుడు పార్వతీ వేషంలో మానస సరోవరం వద్దకు చేరుకున్నారు.అక్కడ లక్ష్మీదేవి నారాయణుని తదేకంగా చూస్తూ ఉంటుంది.నారాయణుడి వేషంలో ఉన్న పార్వతీదేవికి కూడా లక్ష్మి ఎంతో సౌందర్యవతిగా, అందంగా కనిపిస్తుంది.ఇద్దరు ఒక్కసారిగా నాభిప్రాయంగా చూసుకున్నారు.
వీరిద్దరి చూపుల కలయిక వల్ల మానస సరోవరంలో ఎంతో ప్రకాశవంతంగా ఒక స్వర్ణకమలం ఉద్భవించింది.ఆ కమలంలో మెరిసిపోతూ ఒక పాప కూడా ఉద్భవిస్తుంది.

ఆ సమయములు లక్ష్మీదేవి ఒక్కసారిగా నారాయణుడిని కౌగిలించుకోపోతే పార్వతి దేవి ఒక్కసారిగా నవ్వుతూ, నేను నారాయణుడిని కాదు లక్ష్మి, అని చెబుతూ అసలు రూపంలోకి వస్తుంది.నారాయణుడు మోహిని రూపంలో వచ్చి శివుని మంత్రముగ్ధుల్ని చేస్తుంది.ఇప్పుడు పార్వతి వేషంలో వచ్చి సాక్షాత్తు లక్ష్మీ దేవిని మాయ చేశారు.ఈ విధంగా వీరిద్దరూ కలిసి స్వర్ణకమలంలో ఉన్న పాపను దగ్గరకి తీసుకుని మరచిపోతున్న సమయంలో విగ్నేశ్వరుడు వీరి వద్దకు వచ్చి తల్లీ! మీ ఇద్దరి అంశవల్ల జన్మించిన ఈ పాప పార్వతి పరంగా జయ, లక్ష్మీ పరంగా స్త్రీ అని కలిసి “జయశ్రీ” గా పెరుగుతుంది.
ఈమె పెరిగి పెద్దయిన తరువాత ఈమెకు వరుడు కూడా శివ కేశవుల అంశతోనే అవతరించి ఉన్నాడని తెలియజేస్తాడు.ఈ విధంగా పార్వతి దేవి నారాయణ వేషం ధరించడం వెనుక జయశ్రీ ఉద్భవించిందని చెప్పవచ్చు.