తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పట్లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారు చాలా మంది ఉన్నారు.అందులో కృష్ణ ఒకరు.
ఆయన చేసిన చాలా సినిమాల గురించి ఇప్పటికి మనం మాట్లాడుకుంటూ ఉంటాం.అయితే ఎవరికీ సాధ్యం కానీ అద్భుతమైన కొత్తదనాన్ని ఇండస్ట్రీకి తీసుకొచ్చే ప్రక్రియలో కృష్ణ ఎప్పుడూ ముందుంటారు అనేది చాలామంది చెప్పిన విషయమే.
మొదట కలర్ సినిమాని తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు.అలాగే గ్రాఫిక్స్ కి ప్రాధాన్యం ఉన్న సినిమాలు కూడా కృష్ణ నే చేసాడు.
ముఖ్యంగా హాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ సినిమాగా గుర్తింపు పొందిన మెకానస్ గోల్డ్ సినిమా ఇన్స్పిరేషన్ తో కౌబాయ్ సినిమా తెలుగులో తెరకెక్కించే ప్రయత్నంలో భాగంగా మోసగాళ్లకు మోసగాడు అనే సినిమాని తెరకెక్కించాడు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించి ఆ తర్వాత వచ్చే కౌబాయ్ సినిమాలకు ఇన్స్పిరేషన్ గా నిలిచింది అని చెప్పాలి.
కొత్తగా ఇండస్ట్రీకి ఏది రావాలన్నా ముందు కృష్ణ సాహసం చేసి తీసుకొచ్చేవారు అనే అంత గొప్ప పేరు సంపాదించుకున్నాడు కృష్ణ.
ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో కె.
విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన ప్రైవేటు మాస్టారు సినిమాలో సాఫ్ట్ విలన్ క్యారెక్టర్ లో నటించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఈ సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచి నటుడిగా మంచి భవిష్యత్తు ఉంది అని అందరి చేత అనిపించుకొని ప్రముఖుల చేత శభాష్ అనిపించుకున్నాడు.
అయితే ఈ సినిమాలో శోభన్ బాబు కూడా ఒక చిన్న క్యారెక్టర్ లో నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందాడు.ఆ తర్వాత కాలంలో కృష్ణ , శోభన్ బాబు ఇద్దరు అగ్రహీరోలుగా ఎదిగిన విషయం అందరికీ తెలిసిందే.
కృష్ణ అల్లూరి సీతారామరాజు లాంటి పవర్ ఫుల్ సినిమాని తెరకెక్కించి ఒక్కసారిగా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎదిగిన విషయం కూడా మనకు తెలిసిందే.అలా మంచి సినిమాల్ని ఇండస్ట్రీకి తీసుకొచ్చి ఇండస్ట్రీ ఎప్పుడు సక్సెస్ ఫుల్ గా ఉండే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
అందులో భాగంగానే షూటింగ్ పెట్టుకొని సినిమా షూటింగ్ ల మీద బతికే కార్మికులకు ఎంతోమందికి ఉపాధిని కల్పించే ప్రయత్నం చేశాడు.
ఒక రోజుకి మూడు షిఫ్ట్ లలో సినిమా షూటింగ్ లు చేస్తూ ఎప్పుడు బిజీ గా ఉండడానికి ఇష్టపడేవారు కృష్ణ ఒక సంవత్సరంలో ఏకంగా 28 సినిమాలు రిలీజ్ చేసిన ఘనత కూడా ఆయనకే దక్కింది ఇప్పుడు ఉన్న హీరోలు సంవత్సరంలో ఒక సినిమా చేయడానికి నానా ఇబ్బందులు పడుతుంటే ఆయన ఒక సంవత్సరంలో 28 సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.అయితే ప్రస్తుతం కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఇండస్ట్రీలో అగ్రహీరోగా కొనసాగుతున్న విషయం కూడా తెలిసిందే.కృష్ణ హీరోగా చాలా సినిమాల్లో నటించిన తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు అయితే మహేష్ బాబు హీరోగా చేసిన మొదటి సినిమా అయిన రాజకుమారుడు సినిమాలో కూడా మహేష్ బాబు తండ్రిగా నటించి మంచి పేరు సంపాదించుకున్నారు ప్రస్తుతం కృష్ణ ఇంటి దగ్గరే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నాడు మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్నారు.
కృష్ణ లాంటి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో తెలుగు ఇండస్ట్రీలో ఉండటం అనేది అప్పట్లో చాలామంది దర్శక నిర్మాతలు గొప్పగా ఫీల్ అవుతూ ఉండేవారు ఎందుకంటే ప్రొడ్యూసర్లకు దర్శకులకి ఎప్పుడు ఇబ్బంది కలగకుండా కృష్ణ తన సొంత మనుషుల భావించి సినిమాలు చేస్తూ ఉండేవాడు అని చాలా మంది ఇప్పటికీ చెబుతూ ఉంటారు.కృష్ణ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అనేది మాత్రమే నిజంగా వాస్తవం అనే చెప్పాలి…
.