తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.కొద్ది రోజులుగా తిరుమల డ్రోన్ విజువల్స్ కు సంబంధించి వివాదం కొనసాగుతోంది.
దీనిపై ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ విచారణ మొదలైంది.ఇప్పుడు ఈ వివాదం పై ఈవో ధర్మారెడ్డి కూడా స్పందించారు.
డ్రోన్ కి సంబంధించి ఐఓసీకి పర్మిషన్ ఇవ్వడం వాస్తవమేనని ధర్మారెడ్డి వెల్లడించారు.అయితే అన్నదానం నుంచి డంపింగ్ యార్డ్ వరకు మాత్రమే అనుమతి ఉందని వెల్లడించారు.
ఐఓసీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారని వెల్లడించారు.ఐఓసీ సిబ్బందిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.డ్రోన్ తో శ్రీవారి దేవాలయం చిత్రీకరణ పై దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు.యూట్యూబ్లో ఉన్న వీడియోలను తొలగించామని వెల్లడించారు.
తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టం తీసుకొని వస్తున్నట్లు ధర్మారెడ్డి కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.టిటిడి భద్రత విషయంలో ఎక్కడ రాజీ పడడం లేదని ఆయన స్పష్టం చేశారు.
పటిష్టమైన భద్రత వ్యవస్థ ఉందని వెల్లడించారు.

త్వరలోనే యాంటీ డ్రోన్ టెక్నాలజీ అమలు చేస్తామని చెప్పారు.అంతేకాకుండా టీటీడీకి గదుల కేటాయింపులో రూ 71.41 కోట్లు ఆదాయం వచ్చింది అని వెల్లడించారు.శ్రీ వాణి ట్రస్ట్ కు రూ.10,000 విరాళం ఇచ్చిన భక్తులకు ఒకసారి బ్రేక్ దర్శనం పద్ధతిని అమలు చేస్తున్నామని వెల్లడించారు.శ్రీవారి ట్రస్ట్ ద్వారా దాదాపు రూ.650 కోట్ల నిధులు వచ్చినట్లు వెల్లడించారు.26 జిల్లాలలో 2068 దేవాలయాల నిర్మాణంలో ఉన్నాయని ఈవో స్పష్టం చేశారు.

ఇంకా చెప్పాలంటే రాబోయే ఆరు నెలలలో అన్ని దేవాలయాలు నిర్మాణాలను పూర్తి చేస్తామని చెప్పారు.టిటిడి ఆధ్వర్యంలో వసతి గదుల ధరల పెంపు పైన ఆయన స్పందించారు.తిరుపతిలోని శ్రీనివాస కళ్యాణం మండపానికి మరమ్మత్తులు చేశామని తెలియజేశారు.
స్థానికుల కోరిక మేరకు ఆధునికరించి అందువల్లే ధరలు పెంచామని ధర్మారెడ్డి వెల్లడించారు.
DEVOTIONAL