ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల పుణ్యక్షేత్రానికి( Tirumala ) ప్రతిరోజు ఎన్నో వేలమంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.అలాగే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రాకపోకల కోసం రెండు ఘాట్ రోడ్లు కూడా ఉన్నాయి.
అలిపిరి, శ్రీవారి మెట్లు( Alipiri , Srivari stairs ) నడక మార్గాలతో పాటు మొదటి ఘాట్ రోడ్డు, రెండో ఘాట్ రోడ్డు ద్వారా వాహనాల్లో భక్తులు తిరుమల చేరుకుంటున్నారు.కానీ తిరుమల ఘాట్ రోడ్ లో కొన్ని సంవత్సరాలుగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి.
తాజాగా ఒక్కరోజులోనే నాలుగు ప్రమాదాలు జరగడం భక్తులను ఆందోళనకు గురిచేస్తుంది.
అయితే ఆయా ప్రమాదాలన్నీ మొదటి ఘాట్ రోడ్ లోనే జరుగుతుండడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
వాస్తవానికి తిరుమలలో 12 వేల వాహనాలకు మాత్రమే పార్కింగ్ సౌకర్యం ఉంది.కానీ వీకెండ్ లో 30 వేలకు పైగా వాహనాలు పార్కింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.శని, ఆదివారాలలో రోజు 12 వేలకు పైగా వాహనాలు కొండపైకి వస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.తిరుమల నుంచి తిరుపతి రోడ్ లో 16 వేలకు పైగా వాహనాలు కిందికి దిగాయి.
ఈ రకమైన ఘాట్ రోడ్ లో అనూహ్యంగా ట్రాఫిక్ పెరిగి వాహనాల మధ్య కానీస దూరం లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీస్ వారు గుర్తించారు.

అతివేగం డ్రైవింగ్ అవగాహన లేకపోవడం, బ్రేకులు ఫెయిల్ లాంటి సమస్యలతో ప్రమాదాలు జరుగుతున్నాయని తిరుమల అడిషనల్ ఎస్పీ వెల్లడించారు.ఇంకా చెప్పాలంటే తిరుమల మొదటి రోడ్ లో మలుపులు ఎక్కువ ఉండడం కూడా ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది.అలాగే తిరుపతి నుంచి తిరుమలకు 18 కిలోమీటర్ల రోడ్డు లో 28 నిమిషాల్లో ప్రయాణించాల్సి ఉండగా అది వేగంతో వెళ్లే వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి.

అంతేకాకుండా సెల్ఫీల కోసం ఆగి ఉండే వాహనదారులతోనూ ప్రమాదాలు జరుగుతున్నాయి.ఇంకా చెప్పాలంటే తిరుమల ఘాట్ రోడ్ లోని వరుస ప్రమాదాలతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.ఏడవ మైలు వద్ద ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో మహా శాంతి హోమం నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేస్తుంది.స్వామి వారి అనుగ్రహం కోసం ఘాట్ రోడ్డులో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఈరోజు ఉదయం 8 గంటల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ యాగం నిర్వహిస్తూ ఉంది.