హీరో రాజశేఖర్( Hero Rajasekhar ).యాంగ్రీ యంగ్ మాన్ గా మరొక పేరున్న రాజశేఖర్ సినిమాలు అప్పట్లో ఘనవిజయం సాధించేది.
సినిమాల విషయంలో ఆయన ప్రస్తుతం చాలా వెనకంజలో ఉన్నారు.ఆయన ఇద్దరు కూతుళ్లు ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ఆయన సినిమాలు మాత్రం నడవడం లేదు.
సినిమా కెరియర్ మొదలైనప్పటి నుంచి నేటి వరకు రాజశేఖర్ తీరు మార్చుకోకపోవడమే అందుకు ముఖ్యమైన కారణంగా చెప్పుకోవచ్చు.తొలినాల్ల లో అంటే ఆయన స్టార్ హీరోగా ఉన్నారు కాబట్టి నడిచి పోయింది కానీ ఇప్పుడు పుట్టలు పుట్టలుగా హీరోలు ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారు.
టాలెంట్ కి ఎలాంటి కొదవ లేదు అందుకే సీనియర్ హీరోలు ఒక్కొక్కరిగా ఇండస్ట్రీ నుంచి పక్కకు తప్పుకుంటున్న రోజులివి.

అనేక సోర్సెస్ ద్వారా టాలెంట్ ఉన్న హీరోలు తామే కథలు సిద్ధం చేసుకుని మరి నిర్మాతల కోసం వెతుక్కుంటున్నారు.ఇలాంటి తరుణంలో మధ్యాహ్నం షూటింగ్ కి వస్తాను, మధ్యలో మందు తాగుతాను అంటే ఎవరు మాత్రం భరిస్తారు చెప్పండి.హీరోయిన్ జీవిత( jeevitha ) రాజశేఖర్ జీవితంలోకి రాగానే సినిమాల నుంచి తప్పుకుంది.
ఆమె రాజశేఖర్ కెరియర్ ను దాదాపుగా తన కంట్రోల్ లో పెట్టుకుంది.అందుకే రాజశేఖర్ ఒక సినిమా మొదలు పెడుతున్నాడు అంటే కథ నుంచి కథనం వరకు నిర్మాత నుంచి దర్శకుడు వరకు ప్రతి విషయం జీవితే అన్ని తానై చూసుకుంటుంది.

ఇక ఈ మధ్యకాలంలో జీవిత పెత్తనం కూడా కాస్త మిధిమీరిపోయింది అందుకే మీడియాలో కొన్ని గొడవలు పబ్లిక్ గానే బయటపడ్డాయి రాజశేఖర్ చిరంజీవితో( Chiranjeevi ) గొడవపడటం అలాగే ఒక నిర్మాతతో జీవిత పబ్లిక్ గా మీటింగ్స్ పెట్టి మరీ గొడవకు దిగడం వంటి కొన్ని కారణాలవల్ల రాజశేఖర్ తో సినిమా చేయాలంటే ప్రస్తుతం నిర్మాతలు జంకుతున్నారు.పైగా దర్శకులు కూడా రాజశేఖర్ లాంటి హీరోనే కావాలని ఎవరు కాచుకు కూర్చోవడం లేదు.అందుకే ఆయన చేతిలో ఒక్క సినిమా కూడా లేదు వచ్చినా కూడా ఇప్పుడు తీయడానికి జనాలను తీసుకురావడం లేదు కాబట్టి సినిమా తీసి చేతులు కాల్చుకోవడం ఎందుకు అని అనుకుంటున్నారేమో కానీ అందరూ ఆయన గురించి మెల్లిమెల్లిగా మర్చిపోతున్నారు.ఒకపక్క విలన్ గా నటిస్తాను అంటూ ఆయన పలుమార్లు మీడియా ముఖంగా చెప్పినా కూడా ఎవరు అతని మాటలను సీరియస్ గా తీసుకోవడం లేదు.