ఈ ప్రపంచంలో బతకాలంటే రోజంతా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది.ఆ విధంగా రోజంతా కష్టపడి సాయంత్రం ఇంటికి చేరుకునే సమయంలో మన ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటే రోజంతా చేసినపని కూడా మనకు కనిపించకుండా అలసట తీరిపోతుంది.
అంతేకాకుండా మన ఇంటిలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఉంటే ఎంతో చికాకుగా, మనసుకు ప్రశాంతత కరువవుతుంది.ఈ విధంగా మన ఇంట్లో మనకు ప్రశాంతత కరువై పోవడానికి ఈతిబాధలు, నరదృష్టి, ఆరోగ్య సమస్యలు, గ్రహదోషాలు ఉంటాయని పండితులు చెబుతుంటారు.
అయితే వీటి నుంచి విముక్తి పొంది మనసు ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని పద్ధతులను పాటించాలని పండితులు తెలియజేస్తున్నారు.అయితే అవి ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
మన ఇంట్లో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులను వల్ల మనకు ప్రశాంతత కరవవుతుంది.
ఇంట్లో ప్రశాంతత ఉండాలంటే ముందుగా ఆవుపేడతో చిన్న ప్రమిదను తయారు చేసి అందులో నువ్వుల నూనె, బెల్లపు ముక్క వేసి ఆ ప్రమిదను వెలిగించి మన ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం మధ్యలో పెట్టడం ద్వారా మన ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది.
అదేవిధంగా ఒక కొబ్బరి కాయ నల్లటి దారాన్ని కట్టి పూజ గదిలో ఉంచి పూజ చేయాలి.ఉదయం పూజ చేసిన ఆ కొబ్బరికాయలు సాయంత్రం వరకు అక్కడే ఉంచి సాయంత్రం తర్వాత నల్లటి దారంతో సహా కొబ్బరికాయను కాల్చివేయాలి.ఈ విధంగా 9 రోజుల పాటు చేయటం వల్ల మన ఇంట్లో అనుకూల వాతావరణం ఏర్పడి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.
మన ఇంటి ఆవరణంలో ఉన్న తులసి కోటలో ప్రతి రోజు సాయంత్రం తులసి మొక్కకు దీపం పెట్టడం ద్వారా మన ఇంటికి శుభం అని చెప్పవచ్చు.అలాగే మన ఇంటి గుమ్మం దగ్గర శ్వేతార్క గణపతిని ప్రతిష్టించడం ద్వారా మన ఇంటి పై ఏర్పడిన నరదృష్టి, దుష్ట శక్తుల పీడల నుంచి ఆ వినాయకుడు రక్షిస్తాడు.
ఇలాంటి ముఖ్యమైన నియమాలను పాటించేటప్పుడు మంచి రోజు చూసుకుని పాటించడం వల్ల మన ఇంట్లో ఏర్పడిన ఈతిబాధలు గ్రహదోషాలు తొలగిపోయి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.