బిగ్ బాస్ ఇంట్లోకి రష్మీ గౌతమ్.. దారుణమైన డ్యాన్స్ స్టెప్పులతో షాక్!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్ గా వ్యవహరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.

 Rashmi Gautam Mass Steps For Bigg Boss Intlo Maa Parivaar, Rashmi Gautham, Sudhe-TeluguStop.com

ఇదిలా ఉంటే రష్మీ గౌతమ్ ఈటీవీ మల్లెమాల నుంచి డైవర్ట్ అవుతు, కేవలం మల్లెమాల ఈవెంట్స్ లో మాత్రమే కాకుండా స్టార్ మా లో కూడా సందడి సందడి చేస్తోంది.ఇప్పటికే పలుసార్లు స్టార్ మా ఈవెంట్స్ లో తన డాన్స్ స్టెప్పులతో సందడి సందడి చేసిన విషయం తెలిసిందే.

అయితే రష్మీ మాత్రమే కాకుండా సుదీర్ కూడా స్టార్ మా లోకి జంప్ అయ్యాడు.

అయితే గతంలో రష్మీ స్టార్ మా ఈవెంట్ లలో మాత్రమే కనిపించేది.

కానీ సుధీర్ మాత్రం ఏకంగా సింగింగ్ షోకి యాంకర్ గా వ్యవహారిస్తున్నాడు.ఇది ఇలా ఉంటే తాజాగా రష్మి మరోసారి స్టార్ మా కోసం సందడి చేసింది.

స్టార్ మాలో త్వరలో ఒక కొత్త ప్రోగ్రాం రాబోతోంది.ఈ ఈవెంట్ లో రష్మీ డాన్స్ స్టెప్పులని ఇరగదీసింది.

ఈ ఈవెంట్‌లో రష్మీ తో పాటు మాత్రమే శేఖర్ మాస్టర్ కూడా తన స్టైల్లో దుమ్ములేపేశాడు.బిగ్ బాస్ ఇంట్లో మా పరివార్.

వంద రోజుల హంగామా ఒకే రోజులో అంటూ ఓ ఈవెంట్ చేస్తోంది స్టార్ మా.

సీరియల్ సెలెబ్రిటీలను బిగ్ బాస్ ఇంట్లోకి పంపించేశారు.ఇక వారితో కలిసి రష్మీ, శేఖర్ మాస్టర్ వంటి వారు దుమ్ములేపబోతోన్నట్టు కనిపిస్తోంది.ఈ మేరకు వదిలిన ప్రోమోలో రష్మీ మందులోడా ఓరి మాయలోడా అంటూ రష్మీ తన డాన్స్ తో ఒక ఊపు ఊపేసింది.

మొత్తానికి ఈ ప్రోమోతో ఈవెంట్‌ మీద మంచి హైప్ ఏర్పడింది.ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ చూడాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube