పార్వతీ మెల్టన్. తెలుగు సినిమా పరిశ్రమలో కొంత కాలం వెలుగు వెలిగిన నటి.
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన జల్సా సినిమాలో రెండో హీరోయిన్ గా చేసింది ఈ అమ్మడు.తన చక్కటి నటనతో అందరినీ ఆకట్టుంది.
విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది.అనతరం మహేష్ బాబు సినిమా దూకుడులో స్పెషల్ సాంగ్ చేసింది.
పువ్వాయ్ అంటూ తన లేలేత అందాలను ప్రదర్శించి కుర్రకారుల మతులుపోగొట్టింది.ఇవేకాదు.
టాలీవుడ్ లో మరికొన్ని సినిమాల్లో నటించినా అవి అంతగా క్లిక్ కాలేదు.వరుస పరాజయాలతో ఆమె తెలుగులో నిలదొక్కుకోలేదు.
చివరకు వెండితెరకు దూరం అయ్యింది.
అనంతరం పెళ్లి చేససుకుంది.
ప్రస్తుతం అమెరికాలో స్థిరపడింది.ఫ్యామిలీ లైప్ ను సరదాగ గడుపుతోంది.
తాజాగా ఆమె తన సినీ ప్రస్తానానికి సంబంధించిన పలువు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది.సినిమా పరిశ్రమలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వెల్లడించింది.
తాను సినిమాల్లోకి రావడానికి కారనం ఓ టాలీవుడ్ దర్శకుడు అని చెప్పింది.అయితే సినిమారంగంలో ఇద్దరు టాప్ దర్శకులు చేసిన మోసం మూలంగానే తన కెరీర్ నాశనం అయ్యిందని సంచలన ఆరోపణలు చేసింది.
అయితే వారి పేర్లను మాత్రం ఆమె బయటకు రివీల్ చేయలేదు.ప్రస్తుతం తన భర్తతో కలిసి వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు వెల్లడించింది.అయితే ఇంతకీ తనను మోసం చేసిన దర్శకులు ఎవరు అనే అంశంపై సోషల్ మీడియాలో చర్చోప చర్చలు నడుస్తున్నాయి.
పార్వతీ మెల్టన్ చివరి సారిగా సాయిరాం శంకర్ నటించిన యమహో యమ సినిమాలో కనిపించింది.ఆ తర్వాత తను తెలుగు తెరకు దూరం అయ్యింది.ఇంతకీ ఆమె ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడింది అనే అంశం ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.
ఆమె చెప్పిన మాటలను బట్టి.ఆ దర్శకులు పలానావారే అంటే నెటిజన్లు కొన్ని పేర్లు బయటకు తెస్తున్నారు.