నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు నేడు.ఈ సందర్బంగా అభిమానులు నెట్టింట పెద్ద ఎత్తున సందడి చేశారు.
అఖండ సినిమా పోస్టర్ విడుదల చేయడంతో పాటు గోపీచంద్ మలినేని సినిమా అధికారిక ప్రటకన కూడా వచ్చింది.ఇదే సమయంలో సినిమా షూటింగ్ ఎప్పుడు అనే విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు.
అఖండ సినిమా విడుదల విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.కాని విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ రెండు నుండి మూడు వారాలు మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇక బాలయ్య తన పుట్టిన రోజును పెద్ద ఎత్తున నిర్వహించవద్దంటూ ముందే అభిమానులకు సూచించాడు.కరోనా కారణంగా ఏ ఒక్కరు కూడా ఇంటి నుండి బయటకు వెళ్లవద్దని ఇంట్లోనే ఉండి సేఫ్ గా ఉండాలని సూచించిన బాలయ్య తన పుట్టిన రోజు ను నిరాడంబరంగా తనకు ఇష్టమైన బసవతారకం క్యాన్సిన్ ఆసుపత్రిలో చేసుకున్నాడు.

బాలకృష్ణ కు బసవతారకం క్యాన్సిన్ ఆసుపత్రి పై ప్రత్యేక శ్రద ఉంటుంది.అందుకే అన్నదమ్ములు అందరిని కూడా ఒప్పించి మరీ ఆ ఆసుపత్రిని తీసుకున్నాడు.ఆ మద్య లక్ష్మి పార్వతి కూడా ఆ ఆసుపత్రి తనది అంటూ వాదించే ప్రయత్నం చేయగా ఆమె తో రాజీకి వచ్చి మరీ ఆసుపత్రిని తన వద్దే ఉంచుకున్నాడు.కొన్ని వేల మందికి ఆ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్స అందించారు.
దాంతో ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వాడిగా బాలయ్య పేరు దక్కించుకున్నాడు.అదుకే ఆయన కు ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం.
అందుకే మళ్లీ మళ్లీ అక్కడ గడిపేందుకు ఇష్టపడుతాడని ఆయన సన్నిహితులు అంటారు.అందుకే క్యాన్సర్ ఆసుపత్రిలో నే ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ను కట్ చేసి బాలయ్య తన పుట్టిన రోజును సింపుల్ గా జరిపేసుకున్నాడు.