ఈ ఆయిల్ ను వాడితే పురుషులకు బట్టతల భయమే అక్కర్లేదు!

పురుషులను ఎంతగానో కలవరపెట్టే కేశ సమస్యల్లో బట్టతల ముందు వరుసలో ఉంటుంది.జుట్టు కొంచెం అధికంగా రాలుతుంది అంటే మగవారిలో టెన్షన్ మొదలవుతుంది.

 If You Use This Oil, Men Don't Need To Fear Baldness! Baldness, Men, Hair Oil, H-TeluguStop.com

ఎక్కడ బట్టతల ( Bald )వస్తుందో అని తెగ భయపడిపోతూ ఉంటారు.అయితే ఇకపై నో వర్రీ.

ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ ను వాడటం అలవాటు చేసుకుంటే బట్టతల భయమే అక్కర్లేదు.మరి ఇంతకీ ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? దాని ప్రయోజనాలు ఏంటి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Care, Care Tips, Oil, Healthy, Latest, Dontfear-Telugu Health

ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక గ్లాసు కొబ్బరి నూనె ( coconut oil )పోసుకోవాలి.ఆ తర్వాత రెండు కప్పులు ఎండిన వేపాకు ( Dried Neem )వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ వాము( Anise ) మరియు అంగుళం మెత్తగా దంచిన ఎండిన అల్లం వేసి దాదాపు 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించాలి.అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను చల్లారబెట్టుకోవాలి.

పూర్తిగా కూల్ అయ్యాక స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి మంచిగా పదినిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

ఆయిల్ అప్లై చేసుకున్న మరుసటి రోజు లేదా నాలుగు గంటల అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి తల స్నానం చేయొచ్చు.

Telugu Care, Care Tips, Oil, Healthy, Latest, Dontfear-Telugu Health

వారానికి రెండుసార్లు ఈ ఆయిల్ ను కనుక వాడితే తలకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది.జుట్టు కుదుళ్ళు ( hair follicles )దృఢంగా మారతాయి.హెయిర్ ఫాల్ సమస్య దూరం అవుతుంది.

అదే సమయంలో హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.పురుషుల్లో బట్టతల రిస్క్ ను తగ్గించడంలో ఈ ఆయిల్ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.

పైగా వేపాకు, అల్లం చుండ్రు చికిత్సలో తోడ్పడతాయి.స్కాల్ప్ ఆరోగ్యాన్ని పోషిస్తాయి.

కాబట్టి బట్ట తలకు దూరంగా ఉండాల‌ని భావించే పురుషులు తప్పకుండా ఈ ఆయిల్ ను వాడేందుకు ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube