ఏదైనా పెళ్లికో, ఫంక్షన్‌కో వెళ్లాల్సి వచ్చినప్పుడు.మగువలు రెండు, మూడు రోజుల ముందు నుంచే చర్మాన్ని కాంతివంతంగా మార్చుకునేందుకు కుస్తీ పడుతుంటారు.
ముఖ్యంగా బ్యూటీ పార్లర్‌కి వెళ్లి రకరకాల ఫేషియల్స్ చేయించుకుంటారు.ఇందుకోసం వేలకు వేలు ఖర్జు పెడుతుంటారు.
అయితే పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఫేషియల్ గ్లోను తమ సొంతం చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం అదెలాగో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బీట్ రూట్‌ను తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్‌లో వేసి వాటర్ పోయకుండా గ్రైండ్ చేసి.
జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక పల్చటి వస్త్రంలో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి.
అందులో ఉండే వాటర్ ను తొలగించాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల చందనం పొడి, వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండి, నాలుగు టేబుల్ స్పూన్ల బీట్ రూట్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ నీరు తొలగించి పెట్టుకున్న పెరుగు, చిటికెడు వైల్డ్ టర్మరిక్ పౌడర్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్రష్ సాయంతో ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకోవాలి.ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనిచ్చి.అప్పుడు వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్రీన్ చేసుకోవాలి.అనంతరం తడి లేకుండా ముఖాన్ని తుడుచుకుని.ఏదైనా మాయిశ్చరైజర్ లేదా సీరమ్ ను అప్లై చేసుకోవాలి.ఏదైనా పెళ్లికి లేదా ఫంక్షన్‌కు వెళ్లడానికి మూడు రోజుల ముందు నుంచీ ఈ ఫేస్ ప్యాక్ ను రోజుకు ఒక సారి వేసుకుంటే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి ముఖం గ్లోయింగ్‌గా మరియు ఎట్రాక్టివ్‌గా మారుతుంది.
ఈ హోం మేడ్ ప్యాక్‌ను ట్రై చేస్తే ఎలాంటి ఫేషియల్ కూడా అక్కర్లేదు.