సినిమా ఇండస్ట్రీలో దిగ్గజాలుగా కొనసాగుతున్న వారు అప్పుడప్పుడు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తూ ఉండటం లాంటివి చూస్తూ ఉంటాం.ఇలాంటి ఫోటోలు చూసినప్పుడు అభిమానులు అందరూ కూడా ఆశ్చర్యంలో మునిగిపోతూ ఉంటారు.
అప్పుడప్పుడు ఇలా దిగ్గజాలు అందరూ ఒకే ఫ్రేమ్లో ఉన్న ఫోటోలు బయటకు వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.ఇప్పుడు ఇలాంటి ఒక ఫోటో వైరల్ గా మారిపోయింది.
అయితే ఇప్పుడు చూస్తున్న ఫోటోలో దిగ్గజాలు కనిపించడం కాదు.చిత్ర పరిశ్రమలో లెజెండ్స్ గా దిగ్గజ నటులు గా పేరు సంపాదించుకున్న వారి సతీమణిలు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే ముగ్గురు లెజెండ్స్ భార్యలు ఉన్న ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.ఇంతకీ ఆ ముగ్గురి దిగ్గజాల ఎవరు అని అనుకుంటున్నారా.
అక్కినేని నాగేశ్వరరావు.నందమూరి తారకరామారావు, వి.బి.రాజేంద్రప్రసాద్. చెన్నైలో జరిగిన ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో ఈ ముగ్గురు సినీ దిగ్గజల భార్యలు ఒకే ఫ్రేమ్ లో ఫోటో దిగారు.వారి వివరాలు కొన్ని తెలుసుకుందాం.
అక్కినేని అన్నపూర్ణ : 1933 లో పుట్టిన అక్కినేని అన్నపూర్ణ 1949 ఫిబ్రవరి 18న నాగేశ్వర్ రావు పెళ్లి చేసుకున్నారు.వీరికి ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
ఇక ఒక కుమారుడు నాగార్జున సినిమా హీరోగా రాణిస్తూ ఉంటే మరో కుమారుడు వెంకట్ నిర్మాతగా కొనసాగుతున్నాడు.
బసవతారకం : చిత్ర పరిశ్రమలో నటసార్వభౌముడుగా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్న నందమూరి తారక రామారావు సతీమణి బసవతారకం.1942 మేలో ఎన్టీఆర్ బసవతారకం వివాహం జరిగింది.వీరికి 12 మంది సంతానం ఉన్నారు.
ఎనిమిది మంది కుమారులు నలుగురు కుమార్తెలు.రామకృష్ణ (సీనియర్) జయకృష్ణ, సాయికృష్ణ.
హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ (జూనియర్), జయశంకర్ కృష్ణ కుమారులు కాగా; గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు ఉన్నారు.
వీరమాచినేని వసుంధరాదేవి : తెలుగు చిత్ర పరిశ్రమలో లెజెండరి నిర్మాతగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న రాజేంద్రప్రసాద్ సతీమణి వీరమాచినేని వసుంధరాదేవి.కాగా ఈ దంపతులకు జగపతి బాబు తో పాటు మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.ప్రస్తుతం జగపతిబాబు హీరో గా కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే.
ఇలా ముగ్గురు సినీ లెజెండ్స్ భార్యలు ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో ఇది చూసి అభిమానులు మురిసిపోతున్నారు.