జ‌లుబు, ద‌గ్గు ప‌ట్టుకుని వ‌ద‌ల‌ట్లేదా? అయితే ఇది మీరు తాగాల్సిందే!

జలుబు, దగ్గు.ప్రస్తుత వర్షాకాలంలో ప్రధానంగా వేధించే ఆరోగ్య సమస్యలు ఇవి.జలుబు, దగ్గు అనేవి చిన్న సమస్యలుగానే కనిపించినా.వాటిని లైట్ తీసుకుంటే మన శరీరంలో మరెన్నో రుగ్మతలకు అవకాశాన్ని కల్పిస్తాయి.

 This Is The Super Drink To Get Rid Of Cold And Cough Quickly! Super Drink, Cold,-TeluguStop.com

పైగా జలుబు దగ్గు వల్ల ఏ పని పైన శ్రద్ధ వహించలేకపోతుంటారు.రాత్రుళ్లు నిద్ర కూడా సరిగ్గా పట్టదు.

ఈ క్రమంలోనే జలుబు, దగ్గు స‌మ‌స్య‌ల‌ను నివారించుకోవ‌డం కోసం మందులు వాడుతుంటారు.అయితే ఒక్కోసారి మందులు వాడినా ఫ‌లితం ఉండ‌క‌పోవ‌చ్చు.

అలాంటి స‌మ‌యంలో ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను తీసుకుంటే జలుబు, దగ్గు సమస్యలను చాలా వేగంగా మరియు సులభంగా తగ్గించుకోవచ్చు.మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటో.

దాన్ని ఎలా తయారు చేసుకోవాలో.ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఆరు నానబెట్టి పొట్టు తొలగించిన బాదం పప్పులు, నాలుగు మిరియాలు, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు, అర కప్పు వాటర్ వేసుకుని మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ ఆవు పాలను పోసుకోవాలి.

Telugu Cough, Tips, Latest, Rainy Season-Telugu Health Tips

పాలు కాస్త హిట్ అవ్వగానే గ్రైండ్ చేసుకున్న మిశ్రమం తో పాటు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మరిగిస్తే జలుబు, దగ్గు సమస్యను తరిమికొట్టే సూపర్ డ్రింక్ సిద్ధమయినట్టే.ఈ డ్రింక్ ను రోజుకు ఒకసారి తీసుకుంటే కనుక జలుబు, దగ్గు సమస్యలే కాదు గొంతు నొప్పి, గొంతులో గ‌ర‌గ‌రా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు సైతం దూరమవుతాయి.అదే సమయంలో ఇమ్యూనిటీ సిస్ట‌మ్ స్ట్రోంగ్‌గా త‌యార‌వుతుంది. దాంతో వివిధ ర‌కాల వ్యాధులు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube