న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఆగస్టు 6 న ఉపరాష్ట్రపతి ఎన్నిక

భారత 16వ రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది ఆగస్టు 10వ తేదీతో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవి కాలం ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆగస్టు 6న ఉప రాష్ట్రపతి ఎన్నికలకు పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. 

2.రఘురామును హైదరాబాదులోని విచారించాలి

 వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును హైదరాబాదులో ని ప్రభుత్వ అతిథి గృహంలో విచారించేందుకు సిఐడికి హైకోర్టు అనుమతించింది. 

3.తెలంగాణలో కరోనా

  గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 485 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

4.ఆగస్టు ఒకటి నుంచి అడ్వాన్సుడ్ టెస్ట్ సప్లమెంటరీ

 

ఈరోజు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు విడుదలయ్యాయి నేడు ఉదయం 11:30 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.ఆగస్టు ఒకటి నుంచి అడ్వాన్స్ డ్ సప్లమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. 

5.భారత్ లో కరోనా

  గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 18,819 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

6.సత్య సాయి జిల్లాలో ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి

 

శ్రీ సత్య సాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్ల కొండయ్య పల్లి సమీపంలో ఆటోపై హై టెన్షన్ విద్యుత్ తీగల పడి 8 మంది సజీవ దహనమైన ఘటన పై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతులు కుటుంబానికి పది లక్షల ను ప్రకటించారు. 

7.హైదరాబాద్ కు యశ్వంత్ సిన్హా

 కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాకు టిఆర్ఎస్ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆయన  హైదరాబాద్ కి జూలై 2 న రానున్నారు. 

8.కేసిఆర్ కు కిషన్ రెడ్డి లేఖ

 

Advertisement

తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు.రామగుండం లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన ఐదెకరాల భూమిని కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు. 

9.హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ

  హైదరాబాద్ నగర టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.హైదరాబాద్ కు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రానున్న నేపథ్యంలో ఆయనకు స్వాగత ఏర్పాట్లు చేయడం పై కేటీఆర్ చర్చించారు. 

10.హైదరాబాద్ కలెక్టర్ గా అమయ్ కుమార్

 

హైదరాబాద్ కలెక్టర్ గా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అదనపు బాధ్యతలు స్వీకరించారు. 

11.బల్మూరి వెంకట్ అరెస్ట్

  సిద్దిపేటలోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో ఇటీవల కలిసిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థినిలను పరామర్శించేందుకు వెళ్తున్న ఎన్ ఎస్ యు ఐ తెలంగాణ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

12.వైద్యుల నిరసన

 

ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సేవలు అందిస్తున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు అక్రమంగా చెల్లించకపోవడంపై వారు తెలంగాణ వ్యాప్తంగా తమ విధులను నిర్వర్తిస్తూనే నిరసన తెలిపారు. 

13.జగన్ పై లోకేష్ కామెంట్స్

  జిపిఎఫ్ ఖాతాల్లో డబ్బు మాయంపై ప్రభుత్వం చెప్పిన కారణాలపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు.వినేవాళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే , చెప్పేవాడు జగన్ మోసపు రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. 

14.మణిపాల్ ఆసుపత్రి ఎండికి ఫోన్ లో బెదిరింపులు

 

గుంటూరు జిల్లాలోని మణిపాల్ ఆసుపత్రి ఎండీ కి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు.తాము జగన్ అంటూ డబ్బులు ఇవ్వాలని అని ఫోన్ లో బెదిరించినట్లు ఆయన తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

15.చంద్రబాబు అభినందనలు

  ఇంటర్ టాపర్ , ఎన్టీఆర్ మెమోరియల్ కాలేజీ విద్యార్థిని నిత్య గౌడ్ ను టిడిపి అధినేత చంద్రబాబు ప్రశంసించారు. 

16.నేటి నుంచి అమర్నాథ్ యాత్ర

 

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

నేటి నుంచి అమర్నాథ్ యాత్ర  ప్రారంభమైంది.రెండేళ్ల విరామం తర్వాత ఈ యాత్రను ప్రారంభించారు. 

17.చంద్రబాబు కు కిషన్ రెడ్డి ఆహ్వానం

 టిడిపి అధినేత చంద్రబాబుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫోన్ ద్వారా ఆహ్వానం పంపించారు.పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేయబోతున్న అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ కు నరేంద్ర మోదీ హాజరుకానున్న నేపథ్యంలో టిడిపి తరఫున హాజరు కావాల్సిందిగా కిషన్ రెడ్డి కోరారు. 

18.ఆటా 17 వ మహా సభలకు ఎమ్మెల్సి కవిత

 

Advertisement

అమెరికాలోని వాషింగ్టన్ డీసీ లో జరగనున్న (ఆటా ) అమెరికన్ తెలుగు అసోసియేషన్ 17వ మహాసభలకు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరుకానున్నారు. 

19.టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరికలు

  జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం , పాలకుర్తి మండలం  బమ్మెర గ్రామానికి చెందిన దాదాపు 50 మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరారు. 

20.ఈరోజు బంగారం ధరలు

 

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 46,650   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 50,890.

తాజా వార్తలు