సినీ దర్శకుడు హరీశ్ శంకర్(Harish Shankar) కీలక వ్యాఖ్యలు చేశారు.బటన్ పాలిటిక్స్ పై సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రాజకీయాల్లోకి వచ్చిన సంపాదించిన వాళ్లు నిజమైన నాయకులు కాదని హరీశ్ శంకర్(Harish Shankar) అన్నారు.వేరే రంగంలో సంపాదించి.
పాలిటిక్స్ లోకి వచ్చి ప్రజల కోసం ఖర్చు చేసే వాళ్లే మంచి నేతలని పేర్కొన్నారు.అలాంటి వారిని ప్రజలు గుర్తించాలని ఆయన తెలిపారు.
ఈ క్రమంలోనే ఎవరో బటన్ నొక్కితే బతికే ఖర్మ మనకు లేదన్న హరీశ్ శంకర్ మనమే బటన్ నొక్కాలని చెప్పారు.అది ఇవాళ్టి ఈవీఎం బటన్(EVM button) కావాలని తెలిపారు.
ఓటు వేయడం కేవలం హక్కే కాదని, బాధ్యతని స్పష్టం చేశారు.కాగా ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.